New Delhi, Mar 29: తండ్రీ కొడుకుల బందాన్ని కరోనావైరస్ (coronavirus pandemic) ఛిన్నాభిన్నం చేస్తోందనే దానికి ఈ వీడియో (Heartbreaking video) ప్రత్యక్ష ఉదాహరణ. కోవిడ్ 19 (COVID19) పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న ఓ డాక్టర్ (Saudi doctor) ఇంటికి వచ్చిన తరువాత తన కొడుకును చేతుల్లోకి తీసుకోలేక ఏడుస్తూ అలా ఉండిపోయాడు, కొడుకు నాన్నా అంటూ పరిగెత్తుకుంటూ వస్తే.. దగ్గరకు రావద్దు దూరంగా ఉంటూ అంటూ ఏడుస్తూ కూలబడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లను తెప్పిస్తోంది.
దేశ ప్రజలను క్షమాపణ కోరిన ప్రధాని నరేంద్ర మోదీ
వీడియో వివరాల్లోకెళితే.. సౌదీ అరేబియాకు చెందిన ఓ వైద్యుడు కరోనా పేషెంట్లకు చికిత్స అందించి తన డ్యూటీ ముగియగానే మెడికల్ సూట్‌లోనే ఇంటికి (Doctor returns home) చేరుకున్నారు రాగానే అతని కుమారుడు చెంగు చెంగున పరిగెత్తుతూ ఆయన దగ్గరకు వెళ్లాడు. అయితే తండ్రి మాత్రం ఆనందంతో కొడుకుని దగ్గరకు తీసుకుని ముద్దాడలేదు. దగ్గరకు రావద్దు, దూరం జరుగు అంటూ ...అరచేతుల్లో ముఖం పెట్టుకుని కంటతడి పెట్టారు.
Here's Heartbreaking video
A Saudi doctor returns home from saving lives at the hospital and...this happens. It is clear that this kid is used to being hugged when his Papa comes home. I love hugging my kiddos every time I walk in the door.
Our medical professionals are heroes.
— Nick Laparra (@NickLaparra) March 28, 2020
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొమ్మిది సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు పది మిలియన్ల మందికి పైగా వీక్షించగా వందల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.ఈ వీడియోపై నెటిజన్లు భావోద్వేగంగా కామెంట్లు చేస్తున్నారు.
నెలల పసికందును మింగేసిన కోవిడ్-19
కాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్నారు . అసలే మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తుండటంతో దాన్ని అదుపు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరోవైపు కరోనా బారినపడి విలవిలాడుతున్న దేశాలు.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినప్పటికీ అందరూ రోడ్ల మీదకు వచ్చి అందరికీ అంతరాయం కలిగిస్తున్నారు.