Mann Ki Baat: దేశ ప్రజలను క్షమాపణ కోరిన ప్రధాని నరేంద్ర మోదీ, ఎవరైనా లాక్ డౌన్‌ని బ్రేక్ చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే, మన్ కీ బాత్‌లో దేశ ప్రజలకు ప్రధాని సూచన
File image of PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, March 29: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాన్ కి బాత్ (PM Modi Mann Ki Baat) కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ (Coronavirus in India) కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పంచుకున్నారు. ప్రజలు అందరూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై ఆయన పలు సూచనలు చేసారు.

కరోనా నుంచి కోలుకున్న రామ్‌గంపా తేజతో మాట్లాడిన ప్రధాని

కరోనా వైరస్ ని జయించాలి అంటే మాత్రం కఠినం గా ఉండక తప్పడం లేదని మోడీ (PM Modi) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు వైద్యులతో మాట్లాడారు. అలాగే దేశ ప్రజలతో కూడా ఆయన తన మనసులో మాటను పంచుకున్నారు.

వ్యాధిని నయం చెయ్యాలి అంటే లాక్ డౌన్ అనేది తప్పనిసరి అన్నారు. మనం అందరం కూడా స్వీయ నియంత్రణ పాటిస్తే కచ్చితంగా కరోనా మీద యుద్ధం చేసి గెలవడం పెద్ద విషయం కాదని అన్నారు. ప్రజలు అందరూ లాక్ డౌన్ ని కఠినం గా పాటించాలని అన్నారు. మనం కంట్రోల్ లో లేకపోతే అది మరొకరికి సోకుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ (Lockdown) నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కరోనా ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదని అన్నారు.

దేశంలో కరోనా కల్లోలం, 1000కు దగ్గర్లో కరోనా పాజిటివ్ కేసులు, 25కి చేరిన మృతుల సంఖ్య

ప్రపంచ దేశాలను చూసిన తర్వాతే లాక్ డౌన్ నిర్ణయమని అన్నారు. కరోనా కట్టడి కావాలి లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదన్న ఆయన దినసరి కూలీల కష్టాలు తనకు తెల్సు అన్నారు. ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ అని అన్నారు. వైద్య సిబ్బంది జవాన్ల మాదిరి పోరాడుతున్నారని అన్నారు. లాక్ డౌన్ విషయంలో ప్రజల అసౌకర్యానికి చింతిస్తున్నా అని అన్నారు.

భారత రక్షణ దళాలను తాకిన కరోనావైరస్, బీఎస్ఎఫ్ అధికారికి కోవిడ్ 19

ఈ కార్యక్రమంలో వైద్యులను ఉద్దేశించి మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. వాళ్ళు జవాన్ల మాదిరిగా పోరాడుతున్నారని అన్నారు. వైద్యులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మోడీ (PM Narendra Modi) వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ (COVID-19) నయం అయ్యే వ్యాధే అన్న ఆయన ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే దాని మీద గెలవడం అనేది పెద్ద కష్టం కాదని అన్నారు. మనం అందరం కలిసి కరోనా మీద యుద్ధం చేస్తే దాన్ని దేశం నుంచి తరమడం పెద్ద విషయం కాదని మోడీ అభిప్రాయపడ్డారు.

మానవత్వానికే కరోనా సవాల్ విసురుతోందని... కరోనాను కట్టడి చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరం అని అన్నారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని... వైరస్ తీవ్రత ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ మాత్రమే పరిష్కార మార్గం అని చెప్పారు. వారికి నేను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

వైరస్ ను జయించిన వారే మనకు స్పూర్తి ప్రధాతలు, మీ సమయనమే శ్రీరామ రక్ష అని మోడీ అన్నారు.. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000కు చేరువైంది. దేశంలో ఇప్పటివరకూ 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కరోనా భారీన పడి దేశంలో 25 మంది మృతి చెందారు.