Coronavirus in AP (Photo Credits: IANS)

Mumbai, Mar 30: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. మన దేశంలో 21 రోజుల పాటు (Lockdown) ఎవరూ ఇంట్లోకి రావద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బయటకు వస్తే కరోనా (Coronavirus) మీకు వచ్చినట్లేనని కనుక ఎవరూ బయటకు రావద్దని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట తిరగాలని తెలిపింది. అంతలా కరోనావైరస్ ప్రభావం ఉంటే మహారాష్ట్రలోని ఓ కుటుంబం దీన్ని తేలికగా తీసుకుంది. దీంతో ఆ కుటుంబంలోని 25 మందికి కోవిడ్ 19 వ్యాధి సోకింది.

ఏపీలో కరోనా కట్టడికి డ్రోన్ల వినియోగం

ఆ కుటుంబంలోని న‌లుగురు వ్య‌క్తులు సౌదీ అరేబియాకు వెళ్లొచ్చినా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించడంతో విదేశాల‌కు వెళ్లొచ్చిన వారితో క‌లిపి మొత్తం 25 మంది ఇప్పుడు కరోనావైరస్ వ్యాధి భారీన పడ్డారు. కాగా వారంతా ఇరుకుగా ఉండే ఒకే ఇంట్లో ఉండ‌టంతో అందరికీ క‌రోనా మ‌హ‌మ్మారి సోకిందని అధికారులు తెలిపారు.

రాజకీయాలను తాకిన కరోనావైరస్

వివరాల్లోకెళితే.. మ‌హారాష్ట్ర‌లోని సంగ్లీ (Sangli) గ్రామానికి చెందిన న‌లుగురు వ్య‌క్తులు ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. మార్చి 23న స్వగ్రామానికి తిరిగొచ్చారు. అయితే విదేశాల నుంచి వ‌చ్చిన త‌ర్వాత 14 రోజుల‌పాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌న్న నిబంధ‌న‌ల మేర‌కు వారు హోమ్ క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. సంగ్లీలోని ఇస్లామాపూర్ తహసిల్‌కు చెందిన ఈ 25మంది కుటుంబసభ్యులు చాలా ఇరుకు ఇంట్లో నివసిస్తారు. అయితే వారి ఇల్లు ఇరుకుగా ఉండ‌టం, ఆ ఇంట్లో 20 మంది నివాసం ఉండ‌టంవ‌ల్ల అంద‌రికీ క‌రోనావైర‌స్ వ్యాపించింది. తరచూగా ఒకరిని మరొకరు తాకుతూ ఉండటం.. తదిరత పరిణామాల వల్లే ఇలా జరిగింది ని అధికారులు స్పష్టం చేశారు.

21రోజుల తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు అంతా పుకారు

అయితే వారు ఇంటినుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డంవ‌ల్ల ఇరుగుపొరుగు ఎవ‌ర‌కీ ఈ వైర‌స్ సోక‌లేదు. దీనిపై కలెక్టర్ అభిజిత్ చౌదరీ మాట్లాడుతూ.. ఇటువంటి కేసులను ఆరంభంలోనే గుర్తించడం ద్వారా మంచే జరిగిందని, ఒకే కుటుంబంలో ఇందరికి వైరస్ సోకిన విషయం ఆరంభంలోనే గుర్తించక‌పోతే వాళ్లు స్వేచ్ఛ‌గా సమాజంలో తిరిగేవారని, తద్వారా ఈ వైరస్ మరింత మందికి సోకేద‌ని అన్నారు. వైరస్ సోకిన 25 మందని సంగ్లీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రానికి త‌ర‌లించామ‌ని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని క‌లెక్ట‌ర్ తెలిపారు.

ఒక్కరోజే 8మంది మృతి

దీనిపై జిల్లా సివిల్ సర్జన్ సీఎస్ సాలుంఖే మాట్లాడుతూ.. ‘‘కరోనా సోకిన ఓ వ్యక్తి ఇంట్లో దగ్గితే.. ఆ తుంపరులు గదిలోని వస్తువులపై పడతాయి. కొన్ని వస్తువులను ఇంట్లోని అందరు ఉపయోగిస్తారు. అది వైరస్ సోకేందుకు కారణం. అయితే ఎటువంటి వైరస్ లక్షణాలు లేకపోయినా కుటుంబానికి చెందిన 47మందికి పరిక్షలు నిర్వహించామని కానీ, అందులో 25 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా ఉందని తేలింది’’ అని అన్నారు.

వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి

మహారాష్ట్రలో తొమ్మిదో కరోనా మరణం

మహారాష్ట్రలో (Coronavirus in Maharashtra) తొమ్మిదో కరోనా మరణం నమోదైంది. పుణేలో 52 ఏళ్ల ఓ వ్యక్తి కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. పుణేలో నమోదైన తొలి కరోనా మరణం ఇదని నగర మేయర్ మోహోల్ తెలిపారు. అతడి క్లోజ్ కాంటాక్ట్‌‌లను నగరంలోని ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారన్నారు. చనిపోయిన వ్యక్తికి డయాబెటిస్, బీపీ సమస్యలు ఉన్నాయన్నారు. మహారాష్ట్రలో కొత్తగా 12 మందికి కోవిడ్ సోకినట్లు తేల్చగా.. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 215కు చేరింది

గుజరాత్‌లో ఆరు మరణాలు

మరోవైపు గుజరాత్‌లోనూ 45 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోయింది. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య ఆరుకు చేరింది. గుజరాత్‌లో 69 మంది మాత్రమే కోవిడ్ బారిన పడినప్పటికీ ఆరుగురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగా గుజరాత్‌లోనే నమోదు అవుతోంది.

మందు లేక 5మంది ఆత్మహత్య

అహ్మదాబాద్‌లో ముగ్గురు కరోనా కారణంగా చనిపోగా.. భావ్‌నగర్‌లో ఇద్దరు, సూరత్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. భావ్‌నగర్‌లో ఆరుగురికి కరోనా సోకగా ఇప్పటి వరకూ ఇద్దరు చనిపోయారు. డయాబెటిస్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వల్లే గుజరాత్‌లో ఎక్కువ మంది చనిపోయారని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

వుహాన్‌ కరోనా చావుల మిస్టరీ

బెంగాల్‌లోనూ ఓ మహిళ కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. దీంతో బెంగాల్‌లో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది.

ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1071

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 92 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి చేరిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల‌కు వైద్య ప‌రిక‌రాల‌ను అందించేందుకు ఈశాన్య అభివృద్ధి శాఖ కార్గో విమానాల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

దేశ‌వ్యాప్తంగా 3.34 ల‌క్ష‌ల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్న‌ట్లు కేంద్రం చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు 60వేల ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ కిట్ల‌ను ప్రొక్యూర్ చేసింది. రెడ్ క్రాస్ సొసైటీ సుమారు ప‌దివేల కిట్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ది. బ‌రేలీలో వ‌ల‌స కూలీల‌పై డిస్ఇన్‌ఫెక్టాంట్ చ‌ల్లిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి.. లోక‌ల్ ట్రాన్స్‌మిష్ స్టేజ్‌లోనే ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఒక‌వేళ క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ద‌శ‌కు వెళ్తితే, దాన్ని ప్ర‌భుత్వం అంగీక‌రిస్తుంద‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి కేసులు ఏమీ లేవ‌ని ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఆహారం అందేలా చూడాల‌ని అన్ని రాష్ట్రాల‌, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లా మెజిస్ట్రేట్ల‌కు, పోలీసులు ఆదేశాలు జారీ చేశామ‌ని కేంద్ర హోంశాఖ అధికారి పీఎస్ శ్రీవాత్స‌వ తెలిపారు.

అమెరికా, చైనాల మధ్య కరోనా వార్

దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 38 వేల 442 కేసుల‌కు ల్యాబ్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ ఆర్‌. గంగాఖేడ్క‌ర్ తెలిపారు. నిన్న ఒక్క‌రోజే 3501 మందికి ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ సామ‌ర్థ్యం క‌న్నా 30శాతం త‌క్కువే ప‌ని జ‌రుగుతోంద‌న్నారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో గ‌త మూడు రోజుల్లో 1334 ప‌రీక్ష‌లు మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు.