Amaravati, Mar 30: ఏపీలో కరోనావైరస్ (Coronavirus in AP) విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నియంత్రణకు సర్కారు ( AP Govt)పలు జాగ్రతలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) ప్రాంతంలో కరోనా నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటోంది. అక్కడ కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శానిటైజేషన్ ప్రక్రియను (sanitisation process) ముమ్మరంగా చేస్తోంది. దీని కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది.
ఏప్రిల్ 14 వరకు శ్రీవారి దర్శనం రద్దు
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ బృందం (Vijayawada Municipal Corporation) శానిటైజేషన్ ప్రక్రియలో భాగంగా సోడియం హైపోక్లోరైట్ (Sodium Hypochlorite) చల్లడం కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు గాలిలో తిరుగుతూ సోడియం హైపోక్లోరైట్ ను విజయవాడ పరిసర ప్రాంతాల చుట్టూ చల్లుతాయని తెలుస్తోంది. దీని ద్వారా కరోనావైరస్ ను నియంత్రించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Here's ANI Tweet
#WATCH Andhra Pradesh: Vijayawada Municipal Corporation team using drones for spraying Sodium Hypochlorite as part of sanitisation process, in the wake of #Coronavirus. There are 18 active cases of #COVID19 in the state. pic.twitter.com/CPPsYgFrTc
— ANI (@ANI) March 30, 2020
కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరిందని ఈ మేరకు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాజమండ్రి, కాకినాడలో నిన్న రాత్రి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బులెటిన్‌లో సర్కార్ స్పష్టం చేసింది. గత రాత్రి మొత్తం 33 శాంపిల్స్ కలెక్ట్ చేయగా దానిలో రెండు పాజిటివ్ అని తేలింది. రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వ్యక్తికి, కాకినాడకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలి, ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు
ఇదిలా ఉంటే.. రాజమండ్రిలోని కాతేరు పంచాయతీ పరిధిలోని శాంతినగర్‌లోని 72 ఏళ్లు వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో.. స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఆస్పత్రికి తరలించి టెస్ట్‌లు చేస్తున్నారు. మరో 24 గంటల్లో రిపోర్టు రానున్నట్లు తెలుస్తోంది.
మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం
లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల తయారీ, రవాణా సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ (ఎమర్జెన్సీ) పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిత్యావసర వస్తువుల కంపెనీలు, సరఫరాదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ-పాస్‌లు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
ఏపీలో ఉచితంగా రేషన్ సరుకులు, నెల సరుకులను ముందుగానే పంపిణీ చేస్తున్న ఏపీ సర్కారు
దరఖాస్తు చేసుకున్న వారికి మెయిల్ లేదా ఫోన్‌కు అనుమతులు మంజూరు చేసి ప్రభుత్వం పాసులు జారీ చేయనుంది. నిత్యావసర వస్తువుల తయారీ, రవాణాకు చెందిన కంపెనీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఇరవైశాతం మంది ఉధ్యోగులకు లేదా కనీసం ఐదుగురికి నిబంధనలకు లోబడి పాస్‌లు ఇవ్వనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పాస్‌లు జారీ చేస్తారు.
వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి నిత్యావసరాలు కొనేందుకు వెళ్లిన ప్రజలకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి, పంటను తరలించే రైతులకు ఈ-పాస్‌లు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉండే ఈ-పాస్‌లను తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల వద్ద తగిన మెకానిజం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పాస్‌లలో ఫోర్జరీ, దుర్వినియోగానికి పాల్పడితే 2005-ఎన్‌ఎండీఏ చట్టం, భారత శిక్షాసృతి ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది. నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి సరఫరా దారులకు ఈ పాస్ విధానం మరింత సౌలభ్యం కల్పించనుంది.
లింకులు ఇవే
https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration