New Delhi, Mar 30: కరోనావైరస్‌పై పోరుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ (India Lockdown) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు (Centre orders) జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు (migrant workers) ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఇండియాలో 29కు చేరిన మృతులు, 24 గంటల్లో 106 కొత్త కేసులు
ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ను (coronavirus lockdown) పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు. మందు లేక 5మంది ఆత్మహత్య
రాష్ట్రాల మధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని కేంద్రం చెప్పింది. ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణాలు చేసినవారిని 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపంది. కాగా, దేశవ్యాప్తంగా 987 పాజిటివ్ కేసులు నమోదవగా.. 25 మరణాలు సంభవించాయి.
దేశ ప్రజలను క్షమాపణ కోరిన ప్రధాని నరేంద్ర మోదీ
కాగా ఉత్తరప్రదేశ్ , ఢిల్లీ సరిహద్దులో లాక్ అయిన వలస కార్మికులను ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు లాక్ డౌన్ లో ఉంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయినా కూడా చాలా చోట్ల వలస కార్మికులు రోడ్లవెంట నడుచుకుంటూ వస్తున్నారు. పోలీసులు వారిని నిలిపివేసేందుకు ఎంత ప్రయత్నించినా రైల్వే ట్రాక్ వైపు అలాగే పోలీసులు లేని రోడ్లపై నడుచుకుంటూ వస్తున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కరోనా నుంచి కోలుకున్న రామ్‌గంపా తేజతో మాట్లాడిన ప్రధాని
ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 666,000 కు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి 30,900 కి పైగా కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి.