Mumbai, March 29: ఇండియాలో చాపకింద నీరులా కరోనా (Coronavirus) విస్తరిస్తోంది. రోజు రొజుకు దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో (India) 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా106 పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది.
దీంతో కోవిడ్-19 కారణంగాంఖ ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 29కు (COVID-19 Death Toll In India) చేరింది. తాజాగా కోవిడ్-19పై (COVID-19) కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్ విడుదల చేసింది.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆరోగ్య శాఖ (Union Health Ministry) అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేసే ప్రక్రియ కొనసాగుతోందని, రైల్వేశాఖ సహకారంతో గూడ్స్ రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, బొగ్గు, పెట్రోలియం తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నామని అన్నారు. కరోనా నివారణ చర్యలపై మార్గదర్శకాల కోసం 10 బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా ఆరు రాష్ట్రాల్లో కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయని తెలిపారు. భారత్‌లో కరోనావైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 867కు చేరుకున్నది.
దేశ ప్రజలను క్షమాపణ కోరిన ప్రధాని నరేంద్ర మోదీ
కరోనా చికిత్సలో పాల్గొంటున్న హెల్త్‌కేర్ సిబ్బందికి రూ.50లక్షల ఇన్సూరెన్స్ కోసం కసరత్తు జరుగుతోంది. ఆయుష్ విభాగం నిపుణులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారని తెలిపారు. కాగా కరోనాతో చనిపోయిన అందరికి ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న రామ్‌గంపా తేజతో మాట్లాడిన ప్రధాని
అవసరమైన మాస్క్‌లు, వెంటిలేటర్లు దిగుమతి చేసుకున్నాం. ఇప్పటి వరకు 34, 931 మంది అనుమానితుల నమూనాలను పరీక్షించాం. దేశవ్యాప్తంగా టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య పెంచాం. కరోనా నేపథ్యంలో విధులకు హాజరుకాని ఉద్యోగులు, కార్మికులను తొలగించొద్దని అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటున్నాం. అని ఆరోగ్యశాఖ పేర్కొంది.