Thiruvananthapuram, Mar 29: కరోనా వైరస్ ( Coronavirus) వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ( Lockdown) అమలవుతోంది. ఇక అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు, బార్లను మూసివేశారు. కేరళలో అయితే గత రెండు రోజుల నుంచి మద్యం షాపులు మూసివేయడంతో.. మందు బాబులు విలవిలలాడిపోతున్నారు.
కరోనావైరస్ దెబ్బకు కొడుకును దగ్గరకు తీసుకోలేని నిస్సహాయ డాక్టర్ కథ
కేరళలో (Kerala) మద్యం (alcoholics) దొరక్కపోవడంతో త్రిసూర్ జిల్లాకు చెందిన సనోజ్(35) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 5 మంది మందు దొరక్క ఆత్మహత్య చేసుకోవడంతో కేరళ సర్కారు అలర్ట్ అయింది.
దేశ ప్రజలను క్షమాపణ కోరిన ప్రధాని నరేంద్ర మోదీ
దేశవ్యాప్తంగా లాక్డౌన్ సందర్భంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ ప్రకారం భారీగా మద్యం సేవించే మందు బాబులకు (heavy alcoholics) మద్యం సరఫరా చేయాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. మీడియాతో కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ, ఆత్మహత్యలను నివారించడానికి భారీగా మద్యం సేవించేవారికి కొన్ని రకాల షరతులతో మద్యం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. లాక్డౌన్ కాలంలో భారీగా మద్యం సేవించేవారికి మద్యం అందించే పద్ధతులను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విభాగాన్ని ఆదేశించామని పినరయి విజయన్ (Chief Minister Pinarayi Vijayan) చెప్పారు.
నెలల పసికందును మింగేసిన కోవిడ్-19
కాగా రాష్ట్రంలో 1.6 మిలియన్ల మంది రోజూ మద్యపానం చేస్తున్నారని అంచనా. వారిలో, 45 శాతం మంది అధికంగా సేవిస్తూ ఉంటారు. లాక్ డౌన్ ప్రభావంతో వారంతా తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. మందు చుక్క పడక నరాలు జివ్వుమని లాగుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక మందు బాబులు డీఅడిక్షన్ సెంటర్‌లో చేరుతున్నారు. వారంతా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
కరోనా కాటుకు బలైన స్పెయిన్ రాణి
ఇదిలా ఉంటే అంతకుముందే, రాష్ట్రంలోని అన్ని మద్యం మూసివేయాలని ప్రతిపక్షాలు, భారత వైద్య సంఘం డిమాండ్ చేసినప్పుడు సంక్షోభం గురించి మనోరోగ వైద్యులు,సామాజిక శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఓ మందు బాబు మాత్రం నిత్యావసరాల లాగానే ఇంటికే మద్యం సరఫరా చేసే విధంగా అనుమతివ్వాలని ఓ వ్యక్తి కేరళ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. పిటిషనర్‌కు కోర్టు రూ. 50 వేలు జరిమానా విధించింది.