Coronavirus in India (Photo Credits: IANS)

New Delhi, March 30: భారత దేశంలో కరోనావైరస్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) వెయ్యి మార్కును దాటింది. ఆదివారం 106 కొత్త కేసులు (New Cases) నమోదు కాగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,071కు చేరింది. ఒక్కరోజే 8 మంది మరణించగా దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య (COVID 19 Deaths) 30కు పెరిగింది.

వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి

ఢిల్లీలో (Delhi) ఆదివారం కొత్తగా 23 కేసులు నమోదుకాగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 72కు చేరింది. మహారాష్ట్రలో (Maharashtra) అత్యధికంగా 186, ఆ తర్వాత కేరళలో 182 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మందు లేక 5మంది ఆత్మహత్య

కరోనా మరణాల్లో కూడా మహారాష్ట్ర (6) టాప్‌లో ఉండగా, గుజరాత్‌ (5), కర్ణాటక (3), మధ్యప్రదేశ్‌ (2), ఢిల్లీ (2), జమ్ముకశ్మీర్‌ (2), కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కో మరణం నమోదైనట్లు తెలిపింది. డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 85 కాగా... ఇంకా 942 మంది చికిత్స పొందుతున్నారు.

ANI's Tweet:

ఇదిలా ఉంటే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 200కి చేరుకుంది. ఇవాళ ఒక్క‌రోజే ఆ రాష్ట్రంలో 22 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక కేర‌ళ‌లోనూ భారీగానే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఒక్క‌రోజే అక్క‌డ కొత్త‌గా 20 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. మొత్తం 181కి చేరింది. ఇక క‌ర్ణాట‌క‌లో 76, తెలంగాణ‌లో 70, ఏపీలో 21 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక ప్రపంచం మొత్తం మీద 663,740 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 30,879 మరణాలు సంభవించాయి.