Woman Married Herself: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి, 24 గంటల్లోనే విడాకులు, పబ్లిసిటీ కోసమే అంటూ నెటిజన్ల ఫైర్
తనను తానే పెళ్లి చేసుకున్న యువతి (married herself) కేవలం 24 గంటల్లోనే విడాకులు తీసుకుంది. అర్జెంటినాలో (Argentina) సోషల్ మీడియాలో పాపులర్ అయిన సోఫి మయిరె (Sofi Maure)...గత ఫిబ్రవరిలో తన పెళ్లి గురించి ప్రకటన చేసింది. తనను తానే వివాహం చేసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లను అప్ డేట్ చేస్తూ వచ్చింది.
Argentina, March 10: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి (married herself) కేవలం 24 గంటల్లోనే విడాకులు తీసుకుంది. అర్జెంటినాలో (Argentina) సోషల్ మీడియాలో పాపులర్ అయిన సోఫి మయిరె (Sofi Maure) గత ఫిబ్రవరిలో తన పెళ్లి గురించి ప్రకటన చేసింది. తనను తానే వివాహం చేసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లను అప్ డేట్ చేస్తూ వచ్చింది. 25 ఏళ్ల సోఫికి ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్‌లో 5లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన పెళ్లికి సంబంధించిన రింగ్ తీసుకున్నానని, పెళ్లి డ్రస్ కూడా ఫైనల్ అయిందని అన్ని అప్ డేట్లను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించి ఫాలోవర్లు కూడా భిన్నంగా స్పందించారు. ఇదంతా సోషల్ మీడియా అటెన్షన్ కోసమే చేస్తుందని కామెంట్లు పెట్టారు. కొందరు మాత్రం ఆమెకు సపోర్ట్ చేశారు.
ఇలా పెళ్లి డ్రస్ లో ఫోటోలను పోస్టు చేసిన మరుసటి రోజే తాను ఇలా ఉండలేకపోతున్నాను అంటూ మరో సంచలన విషయం బయటపెట్టింది. తనకు విడాకులు కావాలంటూ, తనను తాను పెళ్లి చేసుకొని ఉండలేకపోతున్నా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఫైరవుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తుందంటూ మండిపడుతున్నారు.