India-Canada Tensions: హిందువులు వెంటనే కెనడాను వదిలి వెళ్లిపోండి, అల్టిమేటం జారీ చేసిన ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్

ఇటీవల కెనడా దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్య కేసు రెండు దేశాల మధ్య ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు దౌత్యాధికారులను తమ దేశం విడిచి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చాయి. తాజాగా కెనడాలోని హిందువులను భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అల్టిమేటం జారీ చేసింది.

Sikhs for Justice (Photo-Video Grab)

ఇండో-హిందూ కెనడాను వీడండి. భారత్ కు వెళ్లిపోండి. భారత్ కు మీరు మద్దతుగా నిలవడమే కాదు, ఖలిస్థాన్ అనుకూల సిక్కుల భావ ప్రకటన వ్యక్తీకరణ అణచివేతకు సైతం మద్దతు తెలుపుతున్నారు’’ అంటూ ఎస్ఎఫ్ జే లీగల్ కౌన్సిల్ గుర్ పట్వంత్ పన్నమ్ ఓ వీడియో మెస్సేజ్ ను విడుదల చేశారు.ఈ సంస్థను 2019 లో భారత సర్కారు నిషేధించింది. పన్నమ్ ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించడం గమనార్హం. ఈ హెచ్చరికపై కెనడియన్ హిందూస్ ఫర్ హార్మనీ సంస్థ అధికార ప్రతినిధి విజయ్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు హిందూఫోబియాను కెనడా అంతటా పెద్ద ఎత్తున చూస్తున్నట్టు చెప్పారు.

Sikhs for Justice (Photo-Video Grab)
Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement