Kerala Man Gets Life Sentence In US: భార్యను 17 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త, కేరళవాసికి జీవిత ఖైదు విధించిన అమెరికా న్యాయస్థానం

అమెరికాలో భార్య హత్య కేసులో కేరళవాసికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. భార్యపై మారణాయుధంతో దాడి చేసిన కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు.

Representational image (photo credit- IANS)

అమెరికాలో భార్య హత్య కేసులో కేరళవాసికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. భార్యపై మారణాయుధంతో దాడి చేసిన కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. దోషికి కఠిన యావజ్జీవ శిక్షను విధించారు.

ఫిలిప్ మ్యాథ్యు, మేరిన్ జోయ్‌(26) కేరళకు చెందినవారు. వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది జోయ్‌. అయితే.. మనస్పర్థల కారణంగా మ్యాథ్యు విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే విధులు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న జోయ్‌ని మ్యాథ్యు అడ్డగించి కత్తితో 17 సార్లు పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పైనుంచి కారును పోనిచ్చాడు. జోయ్‌ సన్నిహితులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

మానవత్వం సిగ్గుతో చచ్చిపోయే వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి,ఆ డెడ్ బాడీ మీద నుంచే వెళ్ళిన వాహనాలు

ఆ సమయంలో తనకో పాప ఉంది అని తెలిపిన జోయ్.. నిందితుని వివరాలను తెలిపింది. దీని ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. కేసును నమోదు చేశారు. దాదాపు మూడేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానం దోషికి యావజ్జీవ శిక్ష విధించింది. తీర్పుపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు దోషికి శిక్ష పడినందుకు ఆనందం వ్యక్తం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement