యూపీలోని అమ్రోహలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు ఓ దుర్మరణం చెందాడు, 9వ నెంబరు జాతీయ రహదారిపై ఇది జరగగా.. డెడ్ బాడీని పక్కన పెట్టకుండా వాహనాలు మృత దేహాన్ని తొక్కుతూనే వెళ్లాయి. పోలీసుల హైవే పెట్రోలింగ్ వాహనం ఆ దారిన పోతూ ఈ సంఘటన చూసి అలర్ట్ అయింది.

పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మృతదేహం ముక్కలను సేకరించారు. చీపురుతో మృతదేహం ముక్కలను రోడ్డు పక్క నుంచి తొలగించి తదుపరి చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో దీనిపై అమ్రోహ పోలీసులు స్పందించారు. డిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోదర్‌పూర్ జాతీయ రహదారి 9పై రాత్రి 3 గంటల సమయంలో జరిగిందని, ప్రమాద సమాచారం మేరకు చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Vehicles kept trampling dead bodies on National Highway 9 in Uttar Pradesh

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)