Tattoo Of Marriage Certificate On Arm: ప్రపంచంలో ఇలా ఎవ్వరూ ప్రేమను వ్యక్తపరచి ఉండరేమో! వాలంటైన్ డే రోజున భార్యకు బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్, వినూత్నమైన టాటూతో ప్రేమను తెలియజెప్పిన వ్యక్తి

థాయిలాండ్‌లో అలాంటి తరహా ఘటనలో ఒకటి వెలుగుచూసింది. ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి తన భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఏకంగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌నే టాటూ(Marriage certificate tattoo)లా వేయించుకొని ఆశ్చర్యపరిచాడు. థాయిలాండ్‌కు చెందిన వాల్‌ అనే వ్యక్తి తన చేతిపై వేయించుకున్న టాటూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tattoo Of Marriage Certificate On Arm (PIC @ ร้านสักลายแก่งคอย สระบุรี ช่างชาติ)

Pataya, FEB 16: ప్రేమించే వ్యక్తులను సర్‌ప్రైజ్‌ చేసేందుకు కొందరు రకరకాల పద్ధతులు అనుసరిస్తుంటారు. వాలెంటైన్స్‌ డే(Valentine's Day) వంటి ప్రత్యేక సందర్భాల్లో అయితే తమ ప్రియురాలు/జీవిత భాగస్వామి పట్ల వినూత్నంగా తమ ప్రేమను ప్రకటించి ప్రత్యేకంగా నిలుస్తుంటారు. తాజాగా థాయిలాండ్‌లో అలాంటి తరహా ఘటనలో ఒకటి వెలుగుచూసింది. ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి తన భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఏకంగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌నే టాటూ(Marriage certificate tattoo)లా వేయించుకొని ఆశ్చర్యపరిచాడు. థాయిలాండ్‌కు చెందిన వాల్‌ అనే వ్యక్తి తన చేతిపై వేయించుకున్న టాటూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Viral Video: బతికి ఉన్న చేపను పట్టుకొచ్చిన వెయిటర్, కస్టమర్ చాప్‌స్టిక్‌లను కొరకడంతో షాక్ తిన్న పుడ్ ఆర్డర్ యజమాని, వీడియో సోషల్ మీడియాలో వైరల్ 

సెంట్రల్‌ థాయిలాండ్‌(Thailand)లోని సరాబురి ప్రావెన్స్‌లో  కెంగ్ ఖోయ్‌లోని టాటూ స్టూడియోలో ఎనిమిది గంటలు కుర్చీలో కూర్చొని చేతిపై తమ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని టాటూలా వేయించుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, తొలుత ఆ టాటూను చూసి అతడి భార్య షాక్‌ అయినప్పటికీ.. ఆ తర్వాత తన పట్ల ప్రేమ, గౌరవానికి రుజువుగా ఉన్న ఆ టాటూను అంగీకరించారట. దీనిపై టాటూ వేసిన ఆర్టిస్ట్‌ మాట్లాడుతూ.. ఇంతకుముందు ఎన్నడూ తాను మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను ఇలా టాటూగా వేయలేదని చెప్పాడు. గతంలో ఓ వ్యక్తి తన భార్య పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఆమె ముఖచిత్రాన్ని టాటూలా వేయించుకున్న వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement