IPL Auction 2025 Live

Hajj Pilgrims: పవిత్ర హజ్‌ యాత్రలో భానుడి భగభగలు.. 52 డిగ్రీలతో ఎండ తీవ్రరూపం.. వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతి

ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Hajj Pilgrims (Credits: X)

Newdelhi, June 19: పవిత్ర హజ్‌ యాత్రలో (Hajj Pilgrims) భానుడి భగభగలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమి తాళలేక యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండ తీవ్రత, వడ గాలులతో ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందారు. ఈ మేరకు మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. వీరంతా వేడి సంబంధిత స‌మ‌స్య‌ల‌తోనే మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. ఇక మక్కాలోని అతిపెద్ద ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన‌ అల్-ముయిసెమ్ ఆసుప‌త్రి మార్చురీలో మొత్తం 550 మృత‌దేహాలు ఉన్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. వేడి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డిన సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందించిన‌ట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.

బైక్ అదుపుతప్పి కింద పడిపోయిన డెలివరీ బాయ్.. అప్పుడే వెనుకనుంచి దూసుకొచ్చిన మెర్సిడెస్ కారు.. మీద నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందిన డెలివరీ బాయ్... పూణేలో ఘోరం (వీడియో)

బాధితులు ఈ దేశస్థులే

ఇక చ‌నిపోయిన‌ వారిలో ఈజిప్ట్‌, జోర్డాన్‌ దేశస్తులు అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అలాగే 60 మంది జోర్డానియన్లు కూడా మ‌ర‌ణించార‌ని తెలిపారు.

వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల