Pune Delivery Boy Accident (Credits: X)

Pune, June 19: మహారాష్ట్రలోని (Maharastra) పూణేలో (Pune) ఘోరం జరిగింది. గోల్ఫ్ కోర్స్ చౌక్ దగ్గర బైక్ నియంత్రణ కోల్పోయిన ఓ డెలివరీ బాయ్ (Delivery Boy) రోడ్డు మీద పడిపోయాడు. అదే సమయంలో వెనకనే వచ్చిన మెర్సిడెస్ కారు అతనిపై ఎక్కడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, బాదితుడైన డెలివరీ బాయ్ ను కేదార్ మోహన్ చౌహాన్ (41) గా గుర్తించారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల

ముందటి బైక్ ను అనుసరించి..

ముందటి బైక్ ను అనుసరించడం, ఫ్లై ఓవర్ లైట్ నీడ రోడ్డుమీద పడటంతో కాస్త కంగారు పడిన కేదార్.. బైక్ పై నియంత్రణ కోల్పోయినట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నట్టుండి అతను రోడ్డు మీద పడటంతో మెర్సిడెస్ కారు డ్రైవర్ కు ఏం చేయాలో పాలుపోలేదని, అప్పటికే, సదరు డ్రైవర్ నెమ్మదిగా కారును డ్రైవ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త.. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు.. నోడల్ ఆఫీసర్ నియామకం