Pfizer Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న నర్సు రెండు రోజులకే మృతి, పోర్చుగీస్‌లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సు ఆకస్మిక మరణానికి కారణం తెలపాలని కోరిన తండ్రి, విషాదం వ్యక్తం చేసిన పోర్చుగీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ
పోర్చుగీసులో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సు రెండు రోజుల తర్వాత (Portuguese Woman Dies) చనిపోయారు. ఈ విషయాన్ని డెయిల్ మెయిల్ రిపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ( Pfizer Vaccine) పనితీరు పట్ల మరిన్నిఅనుమానుల, భయాలు రేకెత్తుతున్నాయి.
Portuguese, Jan 5: కరోనా వ్యాక్సిన్ వస్తుందనే ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో విషాదకర వార్త బయటకు వచ్చింది. పోర్చుగీసులో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సు రెండు రోజుల తర్వాత (Portuguese Woman Dies) చనిపోయారు. ఈ విషయాన్ని డెయిల్ మెయిల్ రిపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ( Pfizer Vaccine) పనితీరు పట్ల మరిన్నిఅనుమానుల, భయాలు రేకెత్తుతున్నాయి.
విషాద ఘటన వివరాల్లోకెళితే.. సోనియా అసేవెడో(41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీలో పిడియాట్రిక్ అసిస్టెంట్ నర్స్‌గా (Nurse in California) పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనపై సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. రెండు రోజుల క్రితం తను కరోనావైరస్ వ్యాక్సిన్ (Pfizer coronavirus vaccine) తీసుకుంది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు.
అంతేకాక సోనియాకు మద్యం అలవాటు లేదని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఇక పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోర్చుగీసులో 538 ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక పది మిలియన్ల జనాభా గల పోర్చుగీసులో 4,27,000 కరోనా కేసులు నమోదు కాగా.. 7,118 మంది మరణించారు.
Here's Daily Mail Update:
పోర్చుగీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఒక ప్రకటనలో ఇలా చెప్పింది: జనవరి 1న న పోర్టో ఐపిఓ వర్కర్ Ms Acevedo ఆకస్మిక మరణంపై డైరక్టర్ల బోర్డు విషాదం వ్యక్తం చేస్తోంది. కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు హృదయపూర్వక విచారం వ్యక్తం చేస్తోంది.
Ms Acevedo క్యాన్సర్ చికిత్స, పరిశోధన మరియు విద్యలో జాతీయ మరియు అంతర్జాతీయ సూచన ఆరోగ్య సంస్థ అయిన IPO పోర్టోలో 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఆమె తన కుటుంబంతో కలిసి పోర్టో సమీపంలోని మైయాలో నివసించింది. ఉత్తర పోర్చుగీస్ నగరానికి ఉత్తరాన అరగంట ప్రయాణించిన ఇంటికి చేరుకున్న తరువాత ట్రోఫాలోని తన భాగస్వామి ఇంటిలో మరణించింది.కాగా ఫేస్ మాస్క్‌తో సెల్ఫీని పోస్ట్ చేయడానికి కొద్దిసేపటికే ముందే ఫేస్‌బుక్‌లో తన ప్రొఫైల్ పిక్‌ను మార్చింది.
కొత్త ఏడాదిలో కొత్త కరోనా కలవరం, ఫైజర్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ
ఇదిలా ఉంటే సాధారణంగా వ్యాక్సిన్ అభివృద్ధికి రెండు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కొన్ని దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతిని ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. ఇక మన దేశంలో డీసీజీఐ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.