Covid Updates: కొత్త ఏడాదిలో కొత్త కరోనా కలవరం, ఫైజర్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ, దేశంలో తాజాగా 20,036 మందికి కరోనా, తెలంగాణలో 461 కొత్త కేసులు, ఏపీలో తాజాగా 338 మందికి కోవిడ్
Coronavirus in US (Photo Credits: PTI)

New Delhi, January 1: భారత్‌లో గత 24 గంటల్లో 20,036 మందికి కరోనావైరస్ (Coronavirus Outbreak) పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 23,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు (Coronavirus Outbreak in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 256 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,48,994కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 98,83,461 మంది కోలుకున్నారు. 2,54,254 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 461 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 617 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,815 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,79,456 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,544కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,815 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,674 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 108 కరోనా కేసులు నమోదయ్యాయి

ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగానికి యూకేలో అనుమతి, భారత్ లోనూ త్వరలోనే ఈ టీకాకు ఆమోదం లభిస్తుందని ఊహాగానాలు

ఏపీలో గడచిన 24 గంటల్లో 61,148 కరోనా టెస్టులు నిర్వహించగా, 338 మందికి (AP Coronavirus) వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 65, కృష్ణా జిల్లాలో 44, తూర్పు గోదావరి జిల్లాలో 42 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 328 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, నలుగురు మృతి చెందారు. గుంటూరు, కడప, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,108కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,82,286 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,71,916 మంది కరోనా కోరల నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,262 మందికి చికిత్స కొనసాగుతోంది.

మార్చి నుంచి మే వరకు కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ విశ్వరూపం చూడవచ్చు, గతేడాది కరోనావైరస్ కూడా అప్పుడే సూపర్ స్ప్రెడర్ అయింది, దానికి A4 పేరు పెట్టామని తెలిపిన ఐజిఐబి డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్

కరనావైరస్ కొత్త స్ట్రెయిన్ (Covid New Strain) నేపథ్యంలె యూఎస్ కు చెందిన ఫైజర్ - బయో ఎన్ టెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను (Covid Vaccine) అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతి ఇస్తూ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మరిన్ని దేశాలు ఈ టీకాను అనుమతించేందుకు మార్గం సుగమమైంది. బ్రిటన్ గత నెల 8న ఈ టీకాను ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతిచ్చిందన్న సంగతి తెలిసిందే. ఆపై యూఎస్ తో పాటు కెనడా, పలు యూరోపియన్ దేశాలు కూడా ఫైజర్ టీకాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్‌పై మార్గదర్శకాలు విడుదల, యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ

"2019లో చైనాలో వెలుగుచూసిన వైరస్ ను అడ్డుకునే వ్యాధి నిరోధకతను శరీరంలో పెంచేందుకు ఫైజర్ - బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ పనిచేస్తుంది. దీనికి ఎమర్జెన్సీ వాలిడేషన్ ను ఇస్తున్నాం" అని డబ్లూహెచ్ఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది ఎంతో పాజిటివ్ అడుగని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మరియాంగెలా సిమావో వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ ను ప్రపంచంలోని ప్రజలందరికీ అందించేందుకు ఎంతో కష్టపడాల్సి వుంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకోసం అన్ని వ్యాక్సిన్ కంపెనీలూ సమష్టిగా కృషి చేయాలని అన్నారు.

వివిధ దేశాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలు వివిధ విధానాలను అవలంబిస్తున్నాయని, టీకా దిగుమతి, పంపిణీ విషయాలపై మరింత దృష్టిని సారించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ముఖ్య పాత్రను పోషించేందుకు యునిసెఫ్ వంటి సంస్థలు ముందుకు రావాలని సూచించారు.