Old Man Kisses Flight Attendant: పీకలదాకా తాగి ఫ్లైట్‌లో మగాడికే ముద్దు పెట్టిన వృద్ధుడు, మందు సర్వ్ చేసిన ఎయిర్‌ హోస్టెస్‌పై 60 ఏళ్ల వృద్ధుడి బలవంతం

పీకల దాకా తాగిన వృద్ధుడు మద్యం మత్తులో బరితెగించాడు. వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన అటెండెంట్ ని గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు (Old Man Kisses Male Flight Attendant). అమెరికా డెల్టా ఎయిర్ లైన్స్ లో (Delta Airlines) ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుం

Old Man Kisses Flight Attendant (PIC @ Wikimedia commons, pixabay)

Alaska, April 22: అమెరికా డెల్టా ఎయిర్ లైన్స్ లో (Delta Airlines) ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. పీకల దాకా తాగిన వృద్ధుడు మద్యం మత్తులో బరితెగించాడు. వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన అటెండెంట్ ని గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు (Old Man Kisses Male Flight Attendant). అమెరికా డెల్టా ఎయిర్ లైన్స్ లో (Delta Airlines) ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ వృద్ధుడి పేరు డేవిడ్ అలన్ బర్క్ (David Alan Burk). వయసు 61ఏళ్లు. అలాస్కా వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కాడు. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ కావడంతో.. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు ఆల్కహాల్ సేవించేందుకు బర్క్ కు అనుమతి ఇచ్చారు. అయితే, ఫ్లైట్ రూల్స్ అండ్ రెగులేషన్స్ ప్రకారం.. క్రూ సిబ్బంది.. అతడికి డ్రింక్స్ సర్వ్ చేయలేదు. ఇది బర్క్ కు తీవ్రమైన కోపం తెప్పించింది. డ్రింక్స్ సర్వ్ (Drink) చేయాలని సిబ్బందిలో ఓ అటెండెంట్ ను కోరగా, అతడు తిరస్కరించాడు. దాంతో బర్క్ అతడిపై కోపం పెంచుకున్నాడు.

China Fire: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో 21 మంది సజీవ దహనం, 71 మందికి తీవ్ర గాయాలు, చైనాలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో విషాదం 

కాసేపటి తర్వాత ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. దాంతో సిబ్బంది ప్రయాణికులకు సర్వ్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో బర్క్ తో అంతకుముందు వాగ్వాదానికి దిగిన అటెండెంట్.. మళ్లీ అతడికి దగ్గరికి వచ్చాడు. సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. బర్క్ పీకల దాకా తాగేశాడు. కిక్కు బాగా ఎక్కేసింది. ఈ క్రమంలో అతడు.. తనతో గొడవపడ్డ అటెండెంట్ ను కిస్ అడిగాడు. వృద్ధుడి కోరికతో అతడు బిత్తరపోయాడు. ఒక మగాడు మరో మగాడిని కిస్ అడగటం ఏంటని నివ్వెరపోయాడు.

Yemen Stampede: రంజాన్ వేళ ఘోర విషాదం, యెమెన్‌లో ఆర్థిక సాయం పంపిణీలో తొక్కిసలాట, 80 మంది మృతి, వందలమందికి గాయాలు 

ముద్దు ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో బర్క్ రెచ్చిపోయాడు. అటెండెంట్ ను గట్టిగా పట్టుకున్నాడు. బలవంతంగా అతడి మెడపై ముద్దు పెట్టాడు. దాంతో ఆ అటెండెంట్ షాక్ కి గురయ్యాడు. వృద్ధుడి విపరీత చర్యతో ఇబ్బందిపడ్డాడు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాధితుడు ఎయిర్ పోర్టు అధికారులకు వృద్ధుడిపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు బర్క్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, తనపై చేసిన ఆరోపణలను బర్క్ ఖండించాడు. తాను ముద్దు పెట్టలేదన్నాడు. అసలు మద్యం మత్తులోనే లేనని చెప్పాడు. కాగా, దాడి, నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలపై ఏప్రిల్ 27న కోర్టులో విచారణకు హాజరుకావాలని బర్క్ ని ఆదేశించారు.