Russian Bomb Hits School: 60 మంది చిన్నారులను పొట్టనబెట్టున్న రష్యా, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న మారణహోమం, స్కూల్‌పై బాంబు వేసిన రష్యా బలగాలు

బైలోహారివ్కా (Bilohorivka) గ్రామంలోని స్కూల్ పై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది మరణించారు. దీనిపై లుహాన్స్క్(Luhansk) గవర్నర్ సెర్హీ గైడాయ్ స్పందించారు.రష్యన్ సేనలు శనివారం మధ్యాహ్నం పాఠశాలపై ఓ బాంబును జారవిడిచాయని గవర్నర్ వెల్లడించారు.

Kyiv, May 08: రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం (Russia-Ukraine War) కొనసాగుతోంది. రష్యా బలగాలు బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా యుక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్ ప్రాంతంలో రష్యా(Russia) సేనలు భీకర దాడులు చేపట్టాయి. లుహాన్స్క్(Luhansk) ప్రాంతంలోని బైలోహారివ్కా (Bilohorivka) గ్రామంలోని స్కూల్ పై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది మరణించారు. దీనిపై లుహాన్స్క్(Luhansk) గవర్నర్ సెర్హీ గైడాయ్ స్పందించారు.రష్యన్ సేనలు శనివారం మధ్యాహ్నం పాఠశాలపై ఓ బాంబును జారవిడిచాయని గవర్నర్ వెల్లడించారు. ఆ సమయంలో స్కూల్ లో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. బాంబు దాడితో (Russian Bomb Hits School)స్కూల్ పూర్తిగా నేలమట్టమైందన్నారు. దాదాపు 4 గంటలు శ్రమిస్తేనే కానీ అగ్నికీలలు అదుపులోకి రాలేదన్నారు. 30 మందిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.

”రష్యాకు చెందిన విమానం ఈ భవనంపై బాంబు జార విడిచింది. దాడికి గురైన పాఠశాల సరిహద్దులకు కేవలం ఏడు మైళ్ల దూరంలో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. అనంతరం దాదాపు నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి” అని స్థానిక అధికారులు తెలిపారు.

Women Re live: ఆమె చనిపోయిన కొన్ని గంటల తర్వాత బ్రతికి వచ్చింది, శవపేటికలో పెట్టి పూడ్చుతుండగా కళ్లుతెరిచిన మహిళ, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మళ్లీ మృతి 

కాగా, యుక్రెయిన్ లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి. రష్యా సైన్యం యుక్రెయిన్ లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని యుక్రెయిన్ ప్రభుత్వంతో పాటు, పాశ్చాత్య దేశాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేస్తోంది. ఇది ఇలా ఉంటే.. రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న పలు దేశాలు యుక్రెయిన్ కు అండగా నిలుస్తున్నాయి. యుక్రెయిన్ పెద్ద మొత్తం ఆర్థిక, ఆయుధ సామాగ్రి సాయం చేస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌ నుంచి యుక్రెయిన్‌కు మరో 1.3 బిలియన్‌ డాలర్ల(రూ.12వేల 344 కోట్లు) సైనిక సాయం అందనుంది. ఈ విషయాన్ని బ్రిటన్‌ ట్రెజరీ విభాగం ఆదివారం వెల్లడించింది. వర్చువల్‌ జీ-7 సదస్సుకు ముందు ఈ సాయం ప్రకటించారు. అఫ్ఘానిస్తాన్‌, ఇరాక్‌ యుద్ధం తర్వాత బ్రిటన్‌ ఈ స్థాయిలో కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. గత వారం ఉక్రెయిన్‌కు 300 మిలియన్‌ డాలర్ల సైనిక సాయం చేస్తామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Russia-Ukraine War: విషాద ఘోరం, 165 మంది చిన్నారులు మృతి, ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో చిన్నారులను రష్యా దళాలు పొట్టనబెట్టుకున్నాయని తెలిపిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ 

మరోవైపు రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నానాటికీ దిగజారుతున్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉన్న ఏకైక పరిష్కారం చర్చలు, దౌత్య మార్గమేనని అభిప్రాయపడింది. రక్తపాతం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని మరోసారి నొక్కి చెప్పింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement