Peru, May 04: చావు అంచుల వరకు వెళ్లి బ్రతికి వచ్చినవాళ్లను చూసి ఉంటాం. కానీ పెరూలో ఒక మహిళ మాత్రం చనిపోయి తిరిగివచ్చింది. నిజమే యాక్సిడెంట్‌లో చనిపోయిందని అంతిమ సంస్కారాలు చేస్తుండగా...శవపేటిక (coffin) నుంచి లేచి వచ్చింది. కారు ప్రమాదంలో చనిపోయిందని భావించి, ఒక మహిళను ఆమె బంధువులు శవపేటికలో పెట్టి పూడ్చిపెడుతుండగా..ఆమె ఆ శవపేటికను (coffin) లోపలి నుంచి తట్టడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే పెరూ దేశానికి చెందిన ‘రోసా ఇసాబెల్ సెస్పెడెస్ కలాకా’ (Rosa) ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించింది. ఆ కారు ప్రమాదంలో (Car Accident) కలాకా ముగ్గురు మేనల్లుళ్లు తీవ్ర గాయాలపాలవగా, ఆమె బంధువు ఒకరు మృతి చెందాడు. 5, 11, 17 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు పరిస్థితి విషమించడంతో లంబాయేక్ ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయూలో (ICU) చికిత్స పొందుతున్నారు.
Rosa Callaca tenía 36 años y sufrió un accidente d tránsito en Perú q le provocó la muerte. La defunsión fue dictada el 25 d abril, pero su familia decidió realizar el funeral un día después. Sin embargo, mientras la despedían, ella comenzó a golpear el ataúd y abrió los ojos pic.twitter.com/DRLTkJIeOu
— TARANTINI (@TARANTINI09) April 30, 2022
ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటనలో రోసా ఇసాబెల్ సెస్పెడెస్ కలాకా (Rosa)కూడా మృతి చెందిందని భావించిన బంధువులు ఆమె అంత్యక్రియలకు (Funeral) ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా అనుకున్న సమయానికి కాకుండా ఏప్రిల్ 26న రోసా కలాకా అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు.
అయితే రోసా మృతదేహాన్ని శవపేటికలో పెట్టి గొయ్యిలో దించబోతుండగా, శవపేటిక (coffin)లోపలి నుండి వస్తున్న శబ్దం విని ఆమె బంధువులు షాక్ కు గురయ్యారు మరియు వెంటనే దానిని తెరిచి చూడగా చనిపోయిందని భావించన రోసా సజీవంగా ఉంది. దీంతో వెంటనే ఆమెను అలానే శవపేటికతో సహా ఆసుపత్రికి తరలించారు.
దురదృష్టవశాత్తు ఆమె కొన్ని గంటల తరువాత ఆసుపత్రిలో మరణించింది. దీంతో రోసా బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని రోసా బందువులు తెలిపారు.