Britan, May 01: చట్టాలను చేయాల్సిన దేవాలయంలాంటి పార్లమెంట్‌లో (UK Parliament) గలీజు పని చేశారు బ్రిటన్ ఎంపీ నీల్ పారిష్ (Neil Parish). ఆయన చేసిన పనిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడంతో చేసేదేమీ లేక పదవికి రాజీనామా చేశారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా? సీరియస్‌గా చర్చ జరుగుతుంటే....నీల్ పారిష్ మాత్రం పోర్న్ చూడటంలో(Porn) మునిగిపోయారు. అయితే తాను పొరపాటున పోర్న్ సైట్ (Porn site) ఓపెన్ చేశానని, ఓ ట్రాక్టర్ వెబ్​సైట్ (Tractor website)​ చూద్దామనుకుంటే అదే పేరుతో ఉన్న పోర్న్ సైట్ ఓపెన్ (porn website) అయిందని, కాసేపు చూశానని ఆయన అంగీకరించారు. బ్రిటన్ పార్లమెంటు పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్​గా ఉన్నారు నీల్.

Covid in US: అమెరికాలో కరోనావైరస్ కల్లోలం, వారం రోజుల్లో 37 వేల మంది పిల్లలకు పైగా కరోనా, గత నెల రోజుల్లో 1,24,000 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదు

"అవి పిచ్చి క్షణాలు. నేను ఓ ట్రాక్టర్ వెబ్​సైట్​ కోసం వెతుకుతున్నా. అప్పుడు అలాంటి పేరుతోనే ఉన్న ఓ పోర్న్ వెబ్​సైట్​ ఓపెన్ అయింది. కాసేపు చూశా. తర్వాత రెండోసారి అదే సైట్ ఓపెన్ చేసి చూడడం నేను చేసిన అతి పెద్ద నేరం. రెండోసారి కావాలనే చూశా." అని తన తప్పును అంగీకరించారు నీల్. నీల్.. దాదాపు పదేళ్లుగా అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన సభలోనే కూర్చుని పోర్న్ చూశారన్న వార్తలు పెను దుమారం రేపాయి. మహిళా సభ్యుల నుంచి ఫిర్యాదులు పోటెత్తాయి. లాక్​డౌన్​ వేళ ప్రధాని బోరిస్​ జాన్సన్ పార్టీలకు హాజరవడంపై ఇప్పటికే వ్యతిరేకత ఎదుర్కొంటూ.. ఈనెల 5న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార పక్షం.. నీల్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఫలితంగా ఆయన రాజీనామా చేయక తప్పలేదు.

2016 EgyptAir Crash: విమానంలో సిగిరెట్ వెలిగించిన పైలట్, వెంటనే మంటలు వ్యాపించి 66 మంది సజీవ దహనం, 2016 మే 19న సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ MS804 ప్రమాదంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి..

పోర్న్ వీడియో చూస్తుండగా...పలువురు మహిళా ఎంపీలు (Women MPs) ఆయన పక్కనే ఉన్నారు. అయినప్పటికీ...అవేమీ పట్టించుకోకుండా పోర్న్ సైట్ ఓపెన్ చేసి వాటిని వీక్షించారు. అధికార పార్టీపై ఇప్పటికే పీకలదాకా కోపంతో ఉన్న నెటిజన్లు...నీల్ చేసిన పనిని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.