US Horror: యుఎస్‌లో దారుణం, మహిళను చంపి గుండెను కోసి అత్తమామలకు కూరను వండి పెట్టిన అల్లుడు, తినకపోవడంతో వారిని కత్తితో పొడిచి దారుణంగా హత్య

ఒక వ్యక్తి (US Man Lawrence Paul Anderson) మహిళను హత్య చేసి ఆమె గుండెను కోసి, ఇంటికి తీసుకువెళ్లి కూరను వండాడు. కుటుంబ సభ్యులకు తినిపించేందుకు ప్రయత్నించాడు. అనంతరం జరిగిన గొడవలో ఇద్దరు కుటుంబ సభ్యులను కత్తితో పొడిచి చంపాడు.

US Man Lawrence Paul Anderson Cuts Out Woman's Heart (Photo/@Magicbelle1)

యుఎస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి (US Man Lawrence Paul Anderson) మహిళను హత్య చేసి ఆమె గుండెను కోసి, ఇంటికి తీసుకువెళ్లి కూరను వండాడు. కుటుంబ సభ్యులకు తినిపించేందుకు ప్రయత్నించాడు. అనంతరం జరిగిన గొడవలో ఇద్దరు కుటుంబ సభ్యులను కత్తితో పొడిచి చంపాడు. అమెరికాలోని ఓక్లహోమాలో ఈ దారుణ సంఘటన జరిగింది.అతనికి కోర్టు జీవిత ఖైదు విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ది ఇండిపెండెంట్ ప్రకారం , 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ 2021లో భయంకరమైన హత్యలకు పాల్పడ్డాడు. అతను జైలు నుండి ముందస్తు విడుదల పొందిన ఒక నెల లోపే ఈ దారుణాలకు పాల్పడ్డాడు. అతను విడుదలైన వారాల తర్వాత, ఆండ్రియా బ్లాంకెన్‌షిప్ అనే మహిళను హత్య చేసిన ఆమె గుండెను కోసి (Cuts Out Woman's Heart) తీసుకువెళ్లాడు. దానిని తన అత్తమామల ఇంటికి తీసుకువెళ్లాడు.

శృంగారం మధ్యలో కండోమ్ తీసేసిన ప్రియుడు, కోర్టు కెక్కిన ప్రియురాలు, దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన న్యాయస్థానం..

బంగాళాదుంపలతో అవయవాన్ని (Cooks It For His Family) వండాడు.అనంతరం ఈ రాక్షసుడు 67 ఏళ్ల మామ లియోన్, అతని 4 ఏళ్ల మనవరాలు కేయోస్ యేట్స్‌ను కత్తితో పొడిచి చంపడానికి ముందు వారిద్దరికి ఈ భయంకరమైన భోజనాన్ని వడ్డించడానికి ప్రయత్నించాడాడు.అయితే వారు దానిని అనుమానంతో తిరస్కరించడంతో ఇద్దర్నీ కత్తితో పొడిచి చంపేశాడు.

మరోవైపు మూడు దారుణ హత్యలు, ఒకరిపై హత్యాయత్నానికి పాల్పడిన లారెన్స్ పాల్ ఆండర్సన్‌ను దోషిగా గ్రేడీ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు బుధవారం నిర్ధారించింది. అయితే అతడికి మరణ శిక్ష విధించ వద్దని బాధిత కుటుంబ సభ్యులు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో నిందితుడైన ఆండర్సన్‌కు పెరోల్‌కు అవకాశం లేని జీవితకాల జైలు శిక్షను కోర్టు విధించింది.

పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య, ఫ్యాన్‌కు వేలాడుతున్న బాడీని చూసి గుండెపోటుతో మృతి చెందిన ఇంటి యజమాని

అండర్సన్‌కు ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ కమ్యుటేషన్ ఇచ్చినప్పుడు మాదకద్రవ్యాల కేసులో 20 సంవత్సరాల శిక్షను కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అనుభవించాడు. అతని విడుదల రాష్ట్రం చేసిన సామూహిక కమ్యుటేషన్ ప్రయత్నంలో భాగంగా ఉంది.అయితే దర్యాప్తులో అతను పొరపాటున కమ్యుటేషన్ జాబితాలో ఉంచబడ్డాడని కనుగొన్నారు.

2019 ఆగస్ట్‌లో గవర్నర్‌ క్షమాభిక్ష కింద పెరోల్‌పై విడుదల చేసే ఖైదీల జాబితాలో ఆండర్సన్‌ పేరు పొరపాటున వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ఏడాది జూలైలో తొలిసారి అతడు చేసిన దరఖాస్తును పెరోల్‌ బోర్డు తిరస్కరించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు తిరస్కరణ తర్వాత మూడేళ్లకు తిరిగి దరఖాస్తు చేయాల్సి ఉందన్నారు.

2019 ఆగస్ట్‌లో గవర్నర్‌ క్షమాభిక్ష కింద పెరోల్‌పై విడుదల అయిన వెంటనే నెల లోపే లారెన్స్ పాల్ ఆండర్సన్‌ ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. 2021 ఫిబ్రవరిలో 41 ఏళ్ల ఆండ్రియా లిన్ బ్లాంకెన్‌షిప్ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. ఆ మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె గుండెను కోసి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బంగాళదుంపతో కలిపి ఆ గుండెతో కూర వండాడు. 67 ఏళ్ల అంకుల్‌ లియోన్ పై, 66 ఏళ్ల ఆంటీ డెల్సీ పైకు వడ్డించేందుకు ప్రయత్నించాడు. అంతలోనే ఆండర్సన్‌ మరో దారుణానికి పాల్పడ్డాడు. వారిద్దరితోపాటు నాలుగేళ్ల వారి మనుమరాలిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అంకుల్‌ లియోన్‌, చిన్నారి కేయోస్ యేట్స్ మరణించారు.

అండర్సన్ ఈ హత్యలు, దాడి నేరాన్ని అంగీకరించిన తర్వాత వరుసగా ఐదు జీవిత ఖైదులను అందుకున్నాడు. అయితే ఈ ఘటనపై దాడిలో గాయపడిన అండర్సన్ అత్త, ఇతర బాధిత కుటుంబాలు ఓక్లహోమా గవర్నర్ మరియు జైలు పెరోల్ బోర్డుపై కేసులు పెట్టారు. ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్, పెరోల్‌పై విడుదల కోసం గవర్నర్‌కు సిఫార్సు చేసిన జైలు బోర్డు అధికారులపై కోర్టులో దావా వేశారు.డ్రగ్స్‌ కేసులో శిక్ష పూర్తికాక ముందే నిబంధనలకు విరుద్ధంగా క్షమాభిక్ష కింద పెరోల్‌పై అతడ్ని విడుదల చేయడాన్ని వారు తప్పుపట్టారు.