Us Shocker: నా పేరెంట్స్ నరమాంస భక్షకులు అందుకే చంపేశా! అమెరికాలో తల్లిదండ్రులు, తోబుట్టువులను హతమార్చిన యువకుడు, నన్ను చంపి తినేయాలని చూశారంటూ కోర్టుముందు వాదన
ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు (Teen Murders Parents) తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని (Cannibals) ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది.
Texas , May 27: ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు (Teen Murders Parents) తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని (Cannibals) ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది. టెక్సాస్‌కు చెందిన 18 ఏళ్ల సీజర్ ఒలాల్డే మంగళవారం దారుణానికి పాల్పడ్డాడు. పేరెంట్స్‌తోపాటు అక్క, తమ్ముడిపై గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. కాగా, సీజర్ సోదరి విధులకు రాకపోవడంతో సహ ఉద్యోగి ఒకరు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కుటుంబ సభ్యులను కాల్చి చంపిన సీజర్ ఆ వ్యక్తిపై కూడా గన్‌ను (Gun) గురిపెట్టాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువులను హత్య చేసి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడబోయిన సీజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తన కుటుంబ సభ్యులు నరమాంస భక్షకులని అతడు ఆరోపించాడు. తనను కూడా తినేందుకు వారు ప్లాన్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. మరోవైపు ఇంట్లోని పలు చోట్ల కుటుంబ సభ్యులను కాల్చి చంపిన ఆ యువకుడు వారి మృతదేహాలను బాత్‌రూమ్‌లోకి ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గ్రహించారు.
ఆ ఇల్లంతా రక్తమయంగా ఉండటం చూసి షాక్ అయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సీజర్ వినియోగించిన బుల్లెట్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులను దారుణంగా చంపడంపై కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)