కంబోడియాలో ఓ వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయని పోలీసులు తెలిపారు. ఆ వృద్ధుడు తన పోలంలోని ఆవరణలో ఓ ఎన్‌క్లోజర్‌లో ఈ మొసళ్లును పెంచుతున్నాడు. అందులోని ఓ మొసలి గుడ్లు పెట్టింది.అయితే ఆ గుడ్ల కోసం 72 ఏళ్ల వృద్ధుడు గుడ్లు పెట్టిన బోనులోంచి మొసలిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా, అతను గోడ్‌గా ఉపయోగిస్తున్న కర్రను పట్టుకుని ముసలి లోపలికి లాగింది.అతను ఓ కర్రతో బెదిరిస్తూ పక్కకు తొలగిపోయేలా చేద్దామనుకుంటే అది రివర్స్‌లో అతడి కర్రను బలంగా పట్టుకుని ఎన్‌క్లోజర్‌లోకి లాగింది.
దీంతో ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అంతే ఒక్కసారిగా అక్కడే ఉన్న 40 మొసళ్లు అతని శరీరాన్ని ముక్కలు చేసి తినేశాయి. ఆ ప్రాంతంలో అతడి ఆవశేషాలు మాత్రమే కనిపించాయి. సీమ్ రీప్‌లోని పొలం వద్ద ఉన్న కాంక్రీట్ ఆవరణ రక్తంతో నిండియింది. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు.
కంబోడియాలోని సియెమ్ రీప్ చుట్టూ అనేక మొసళ్లు సంరక్షణ ఎన్‌క్లోజర్‌లు ఉన్నాయి. అక్కడివారు ఈ మొసళ్లను వ్యాపారం కోసం పెంచుతుంటారు. అక్కడి వారు వాటితో గుడ్లు, మాంసం, చర్మం తదితరాల వ్యాపారం చేస్తుంటారు. ఇక 2019లో అదే గ్రామంలో రెండేళ్ల బాలికను మొసళ్లు చంపి తిన్నాయని పోలీసు చీఫ్ తెలిపారు. సియెమ్ రీప్ చుట్టూ అనేక మొసళ్ల పొలాలు ఉన్నాయి, ఇది అంగ్కోర్ వాట్ యొక్క ప్రసిద్ధ శిధిలాలకు ప్రవేశ ద్వారం. సరీసృపాలు వాటి గుడ్లు, తొక్కలు, మాంసం కోసం అలాగే వాటి పిల్లల వ్యాపారం కోసం ఉంచబడతాయి.