IPL Auction 2025 Live

Ukraine President Video: నేను ఇక్కడే ఉన్నా: ఉక్రెయిన్ ప్రెసిడెంట్, అధ్యక్ష భవనం నుంచి సెల్ఫీ వీడియో, మిటలరీతో పాటూ ఉన్నానంటూ భరోసా, రష్యాపై ఆరోపణలు

తాను రాజధాని కీవ్ నగరంలోనే ఉన్నట్లు సోషల్ మీడియాలో (Social Media) ఒక వీడియోను పోస్ట్ చేశారు. తనతో పాటూ Kyiv ను కాపాడుకునేందుకు నిల్చొన్న ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సెల్ఫీ వీడియోలో కనిపించాడు.

Kyiv, Feb 26:  రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య ఉద్రిక్తతలతో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. అయితే రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ (Ukraine President) జెలెన్ స్కీ (Volodymyr Zelensky) ఎట్టకేలకు బయటకు వచ్చారు. తాను రాజధాని కీవ్ నగరంలోనే ఉన్నట్లు సోషల్ మీడియాలో (Social Media) ఒక వీడియోను పోస్ట్ చేశారు. తనతో పాటూ Kyiv ను కాపాడుకునేందుకు నిల్చొన్న ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సెల్ఫీ వీడియోలో కనిపించాడు. సెంట్రల్ Kyiv నుంచి తీసుకున్న వీడియోతో ఉక్రెయిన్ నుంచి పారిపోతున్నాడంటూ జరిగిన పుకార్లకు చెక్ పెట్టాడు. ‘మేమంతా ఇక్కడే ఉన్నాం. మా మిలటరీ (military) ఇక్కడే ఉంది. సమాజంలో పౌరులు ఇక్కడే ఉన్నారు. మా ఇండిపెండెన్స్ ను కాపాడుకునేందుకు ఇక్కడే ఉన్నాం. ఇలాగే ఉంటాం’ అని చెప్పారు ప్రెసిడెంట్. ఆ వీడియోలో ప్రెసిడెంట్, చీఫ్ స్టాఫ్, ఇతర సీనియర్ అధికారులు ప్రెసిడెన్సీ బిల్డింగ్ బయట కనిపించారు.

‘ప్రెసిడెంట్ పుతిన్, మినిష్టర్ లారోవ్ ఈ చర్యలకు బాధ్యులు. కిమ్ జంగ్ ఉన్, అలెగ్జాండర్ ల్యూకాషెంకో, బషర్ అల్ అస్సద్ లు కలిసి పుతిన్ ఓ చిన్న గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు’ అంటూ నార్త్ కొరియా, సిరియా, బెలారస్ లను ప్రస్తావించి యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ స్టేట్మెంట్ లో చెప్పింది. మరోవైపు అక్కడే ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Russia-Ukraine war Updates: చైనా జోక్యంతో మొత్తబడ్డ పుతిన్, ఉక్రెయిన్ అధికారులతో చర్చించేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటన, బెలారస్ లో చర్చిద్దాం రండి! అంటూ రష్యా అధ్యక్షుడి కార్యాలయం ప్రకటన

రొమేనియా నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు భారత్ బయలుదేరాయి. ఇప్పటికే రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ, ముంబైలకు విమానాలు బయల్దేరాయి. ఒక విమానం కాసేపట్లో రానుండగా, మరో ఎఐ 1944 విమానం మధ్యాహ్నం ముంబైకు చేరుకోనుంది. ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరారు.