Corona Outbreak In China: చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. మరణాలపై అందని సమాచారం.. వీడియోతో

కరోనా మహమ్మారి దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. ఈ వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు.

COVID-19 in China. (Photo Credits: IANS)

Beijing, Dec 24: గడిచిన మూడేండ్లుగా యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి ఉదృతస్థాయిలో విరుచుకుపడుతున్నది. వైరస్ దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. హాస్పిటల్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు తగినంతగా లేక విలవిలలాడుతున్నది.

కలవరపెడుతున్న BF.7 వేరియంట్, త్వరితగతిన వ్యాక్సినేషన్‌ చేపట్టాలని రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్రం

డిసెంబర్ తొలి 20 రోజుల్లో చైనాలో దాదాపు 24.8 కోట్ల మందికి వైరస్ సోకింది. ఇది చైనా మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నిన్న అంతర్గతంగా సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ లో దిగ్భ్రాంతికి గురి చేసే ఈ విషయం ఉంది. అంతేకాదు ఈ వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. చైనాలో ఇంతకు ముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. ఈ ఏడాది జనవరి 19న ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకే రోజున దాదాపు 4 కోట్ల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

చైనాలో కరోనా విజృంభణ, రోజుకు 10 లక్షల కరోనా కేసులు, 5 వేల మరణాలు, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 42 లక్షలకు చేరుకుంటుందని వార్తలు

ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చెప్పొచ్చు. అయితే ఈ మీటింగ్ మినిట్స్ లో కరోనా మరణాలు ఎన్ని నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement