Bajaj Finance Limited: డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్ రేటుని 8.85% వరకు పెంచిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి., ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్ & వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.
Hyderabad, జనవరి 3 : దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి., ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్ & వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.
2024 జనవరి 2 నుంచి, బజాజ్ ఫిన్సర్వ్ ఆప్, వెబ్సైట్ ద్వారా 42 నెల్ల కాలపరిమితికి బుక్ చేసుకున్న ఎఫ్డిలకు సీనియర్ సిజిటన్లకు బజాజ్ ఫైనాన్స్ ఏడాదికి 8.85% వరకూ ఇవ్వనుంది. 60 ఏళ్ళలోపు వయసున్న డిపాజిటర్లు ఏడాదికి 8.60 వరకూ వడ్డీ పొందవచ్చు. కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరయిన డిపాజిట్లని 42 నెల్ల కాలపరిమితికి రెన్యువల్ చేసినప్పుడు కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి, గరిష్టంగా రూ. 5 కోట్ల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ కి, 2023 సెప్టెంబర్ 30 నాటి వరకూ, 76.56 మిలియన్ ఖాతాదారులు, 44.68 మిలియన్ నెట్ యూజర్లు వున్నారు. డాటా.ఐఒ నివేదిక ప్రకారం, ప్లేస్టోర్ లోని ఫైనాన్షియల్ డొమైన్లో, భారతదేశంలో బజాజ్ ఫిన్సర్వ్ ఆప్, అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న 4వ యాప్ గా నిలిచింది.2023 సెప్టెంబర్ 30 నాటికి, రూ. 54,821 కోట్ల పైగా మొత్తం డిపాజిట్ బుక్, 1.4 మిలియన్ డిపాజిట్లతో, ఈ కంపెనీ దేశంలోనే అత్యధిక డిపాజిట్లు స్వీకరించిన ఎన్బిఎఫ్సి గా అవతరించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)