BMW Car: డ్రైవర్ మూడ్ ను బట్టి రంగులు మార్చే బీఎండబ్ల్యూ కారు... అదరగొట్టే రంగులతో కళ్లు జిగేల్.. వీడియో ఇదిగో!

జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ అమెరికాలోని లాస్ వేగాస్ లో జరుగుతున్న సీఈఎస్ ఈవెంట్ లో ఓ కొత్త కారును ప్రదర్శించింది. ఆ కారును చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే, ఆ కారు 240 రంగులు మార్చింది.

Credits: Twitter

Los Vegas, Jan 21: జర్మనీ (Germany) కార్ల (Cars) తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ (BMW) అమెరికాలోని (America)  లాస్ వేగాస్ (Los Vegas) లో జరుగుతున్న సీఈఎస్ (CES) ఈవెంట్ (Event) లో ఓ కొత్త కారును ప్రదర్శించింది. ఆ కారును చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే, ఆ కారు 240 రంగులు మార్చింది. ఈ కారు పేరు ఐ విజన్ డి. పరిస్థితులను బట్టి రంగులు మార్చే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు. డ్రైవర్ ఏ మూడ్ లో ఉన్నాడన్నది పరిగణనలోకి తీసుకుని ఈ కారు రంగులు మార్చేస్తుంది. అందుకోసం ఈ-ఇంక్ టెక్నాలజీ ఉపయోగించారు.

బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందో చూశారా.. ఢిల్లీలో సీఈ-04ని ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ.. వచ్చే జనవరిలో మార్కెట్లోకి!

ఈ ఐ విజన్ డి కారును భారత్ లోనూ తీసుకువచ్చేందుకు బీఎండబ్ల్యూ ప్రణాళికలు రచిస్తోంది. అయితే, రెండేళ్ల తర్వాతే ఇది భారత్ లోకి రానుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ కారును త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు బీఎండబ్ల్యూ సన్నద్ధమవుతోంది.  ఈ కారులో మరో కొత్త టెక్నాలజీ కూడా ఉంది. ఓ సినిమా తెరపై ప్రదర్శించినట్టుగా, కారు విండ్ షీల్డ్ పై డిజిటల్ ఫార్మాట్ లో డ్రైవింగ్ డేటాను పొందే వీలుంది. కారు వేగం, మైలేజి, నేవిగేషన్ వంటి అంశాలను కారు విండ్ షీల్డ్ పై చూడొచ్చట.

టెస్లా కార్లకు షాక్, తప్పుడు ప్రకటనలు చేసిందంటూ 2.2 మిలియన్ డాలర్లు ఫైన్ విధించిన దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement