Harish Rao (Photo-BRS)

Hyderabad, JAN 10: హాలీవుడ్‌తో తెలుగు సినిమా పోటీ పడేందుకు విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగపడతాయని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ తెలుగు చిత్రపరిశ్రమకు (Tollywood) ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గౌరవం ప్రపంచవ్యాప్తంగా పెరగాలన్నారు. మరింత మంచి చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్ లో రావాలని చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో కల్ప్రా వీఎఫ్‌ఎక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కల్ప్రా వీఎఫ్ఎక్స్ సీఈవో మల్లేశ్వర్ సిద్దిపేట లాంటి పట్టణాల్లో ఐటీ కంపెనీని పెట్టి ఎంతో మంది యువతను ప్రోత్సహించారని అన్నారు. కల్ప్రా వీఎఫ్ఎక్స్ వారు తెలుగు పరిశ్రమలో రాణించాలని, మంచి అవకాశాలు అందుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Game Changer Review in Telugu: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ ఇదిగో, అభిమానులకు పుల్ గేమ్, మరి ప్రేక్షకులకు ఈ గేమ్ బాగా నచ్చిందా లేదా ? శంకర్ మొదటి తెలుగు సినిమా ఎలా ఉందో చూద్దామా.. 

ముఖ్యమంత్రి (CM Revanth Reddy) అనాలోచిత నిర్ణయాల వల్ల ఇటీవల తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇంకెప్పుడూ సినిమా రేట్లు పెంచం, స్పెషల్ షోలకు (Special Shows) పర్మిషన్ ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మరో సినిమాకు స్పెషల్ షోలకు అనుమతిచ్చారని మండిపడ్డారు. నచ్చితే ఒకలాగా నచ్చకపోతే మరోలాగా వ్యవహరించడం ముఖ్యమంత్రి స్థాయికి మంచిది కాదని హితవు పలికారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కూడా విలువ లేకపోతే ఎలా ముఖ్యమంత్రి గారు అని నిలదీశారు. అందరికీ సమానంగా రూల్స్ ఉండాలని అన్నారు. నచ్చిన వారికి ఒకలాగా నచ్చని వారికి మరోలా ఉండకూడదని చెప్పారు. గేమ్ ఛేంజర్ సినిమాకు టంగ్ చేంజర్ అయిన ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి  

చిత్ర పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ అని హరీశ్‌రావు అన్నారు. తెలుగు సినిమా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టిందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడకూడదని హితవు పలికారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చిత్ర పరిశ్రమకు కేసీఆర్ ప్రోత్సాహాన్ని ఇచ్చి అద్భుతంగా వృద్ధి చెందేలా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ స్థిరపడడానికి కేసీఆర్ కృషి చేశారని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మరింత బలపడాలని వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును సాధించాలని, అందులో కల్ప్రా విఎఫ్ఎక్స్ మంచి అవకాశాలను అందుకోవాలని ఆకాంక్షించారు.