Newdelhi, Dec 11: జర్మనీ (Germany) ఆటోమొబైల్ (Automobile) దిగ్గజం బీఎండబ్ల్యూ (BMW) భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) ను తీసుకువస్తోంది. ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్ లో సీఈ-04 (CE-04) ఎలక్ట్రిక్ స్కూటర్ ను బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ పోర్ట్ ఫోలియోలో ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ (First Electric Scooter). దీన్ని వచ్చే ఏడాది జనవరి మాసంలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. దీని ఎక్స్ షోరూమ్ ధరల వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.
విశేషాలు ఇవి
- బీఎండబ్ల్యూ సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 8.9 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు.
- ఇది 42 హార్సపవర్ లేదా 31 కిలోవాట్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
- ఈ స్కూటర్ 2.6 సెకన్లలోనే 50 కిమీ వేగం అందుకుంటుంది.
- ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కిమీ ప్రయాణించవచ్చు.
- దీని గరిష్ఠ వేగం గంటకు 120 కిలోమీటర్లు.
- 100 శాతం చార్జింగ్ కు 4 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది.
- అదే, 6.9 కిలోవాట్ చార్జర్ ఉపయోగిస్తే చార్జింగ్ సమయం 1 గంట 40 నిమిషాలకు తగ్గిపోతుంది.
#BMW also showcased the #CE04 electric scooter at Joytown. It is claimed to offer a range of 129 km per charge. @BMWMotorrad_IN #BMWCE04 #BMWIndia pic.twitter.com/UYG57VNGbx
— Express Drives (@ExpressDrives) December 10, 2022