BMW Electric Scooter: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందో చూశారా.. ఢిల్లీలో సీఈ-04ని ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ.. వచ్చే జనవరిలో మార్కెట్లోకి!
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువస్తోంది. ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్ లో సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ పోర్ట్ ఫోలియోలో ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.
Newdelhi, Dec 11: జర్మనీ (Germany) ఆటోమొబైల్ (Automobile) దిగ్గజం బీఎండబ్ల్యూ (BMW) భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) ను తీసుకువస్తోంది. ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్ లో సీఈ-04 (CE-04) ఎలక్ట్రిక్ స్కూటర్ ను బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ పోర్ట్ ఫోలియోలో ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ (First Electric Scooter). దీన్ని వచ్చే ఏడాది జనవరి మాసంలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. దీని ఎక్స్ షోరూమ్ ధరల వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.
విశేషాలు ఇవి
- బీఎండబ్ల్యూ సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 8.9 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు.
- ఇది 42 హార్సపవర్ లేదా 31 కిలోవాట్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
- ఈ స్కూటర్ 2.6 సెకన్లలోనే 50 కిమీ వేగం అందుకుంటుంది.
- ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కిమీ ప్రయాణించవచ్చు.
- దీని గరిష్ఠ వేగం గంటకు 120 కిలోమీటర్లు.
- 100 శాతం చార్జింగ్ కు 4 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది.
- అదే, 6.9 కిలోవాట్ చార్జర్ ఉపయోగిస్తే చార్జింగ్ సమయం 1 గంట 40 నిమిషాలకు తగ్గిపోతుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement