Hero Passion Plus: ఫ్యాషన్ ప్లస్ బైక్ మళ్లీ ఇండియాకు వచ్చేసింది, మూడు కలర్ ఆప్షన్స్‌‌తో బడ్జెట్ ధరకే సామాన్యుడి బైక్, పూర్తి వివరాలు ఇవిగో..

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) బైక్ ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) మూడేళ్ల క్రితం ఇండియాలో నిలిపివేసిన సంగతి విదితమే. బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా ఈ బైక్ భారత మార్కెట్ నుంచి పక్కకు వెళ్లింది. ఈ బైక్ మళ్లీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Hero Passion Plus Bike

హీరో ఫ్యాషన్ ప్లస్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్స్‌తో లభిస్తోంది.సెల్ఫ్ స్టార్ట్, డిజిటల్ అనలాగ్ డిస్‌ప్లే, USB ఛార్జింగ్ పోర్ట్‌ వంటివి వాటిని పొందుతుంది. ఈ బైక్ మార్కెట్లో హోండా షైన్, బజాజ్ ప్లాటినా మొదలైన 110 సీసీ విభాగంలోని బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది.

రోల్స్ రాయిస్‌కి భారీ షాక్, భారత ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు

కొత్త హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. కాగా ఈ బైక్ లాంగ్ స్టాండింగ్ ఎయిర్ కూల్డ్, 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉపయోగించి అదే 8 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఇప్పుడు OBD-2 కంప్లైంట్ అండ్ E20 కి సిద్ధంగా తయారైంది. ఈ బైక్ ఐ3ఎస్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా పొందుతుంది.

హీరో ఫ్యాషన్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్క్ & ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌ కలిగి డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ పొందుతుంది. ఈ బైక్ బరువు 115 కేజీలు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఉన్న 100 సీసీ విభాగంలో ఇదే అత్యంత బరువైన బైక్ అని తెలుస్తోంది. ముందు, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement