CBI Files Case Against Rolls Royce: రోల్స్ రాయిస్‌కి భారీ షాక్, భారత ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు
Rolls Royce. (Photo Credits: Twitter)

New Delhi, May 29: రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భారీ షాక్‌ తగిలింది. 24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసం చేశారని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్‌సహా, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్‌లపై కేసు నమోదు చేసింది.

ఆటోమొబైల్ రంగంలో లేఆప్స్, 3 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలో రోల్స్ రాయిస్, కంపెనీ స్పందన ఇదే..

రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్, ఆయుధాల డీలర్లు సుధీర్ చౌదరి , భాను చౌదరితోపాటు, ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.రోల్స్ రాయిస్ పిఎల్‌సి, యుకె , ఎం/ఎస్ రోల్స్ రాయిస్ టర్బోమెకా లిమిటెడ్‌తో సహా దాని అసోసియేట్ గ్రూప్ కంపెనీల నుండి హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ కేసు సంబంధించినదని సీబీఐ ప్రకటించింది