Honda BR-V N7X Edition: మారుతి ఎర్టిగా, కియా కారెన్స్ వంటి కార్లకు పోటీగా హోండా నుంచి సరికొత్త SUV, సరికొత్త BR-V N7X ఎడిషన్ కారును ప్రవేశపెట్టిన కార్ మేకర్, దీని ధర ఎంతో తెలుసా?!
Honda BR-V N7X Edition: ప్రముఖ కార్ మేకర్ హోండా ఇప్పుడు మరొక కొత్త కారును తీసుకురాబోతుంది. ప్రస్తుతం జరుగుతున్న 2024 ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో (IIMS)లో భాగంగా తమ బ్రాండ్ నుంచి సరికొత్త 'హోండా BR-V N7X' ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ మూడు వరుసల 7-సీటర్ క్రాస్‌ఓవర్ SUV, ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్‌లో సరికొత్త మార్పులు అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. నిజానికి హోండా BR-V, ఒకప్పుడు భారత మార్కెట్లో ప్రముఖంగా ఉండేది, అయితే తక్కువ విక్రయాల కారణంగా నిలిపివేయబడింది. అయినప్పటికీ ఏసియన్ మార్కెట్లో ఈ కారుకు ఉన్న ప్రజాదరణ కారణంగా ఇప్పుడు సరికొత్త రూపంతో రాబోతుంది.
సరికొత్త హోండా BR-V N7X ఎడిషన్ అధునాతన అమేజ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించారు, ఈ రెండవ తరం BR-V లుక్ పరంగా గణనీయమైన మార్పులతో వస్తుంది, మొదటి తరంలో ఉన్న డిజైన్ క్రమరాహిత్యాలను సరిదిద్ది, ఇప్పుడు మరింత స్పష్టమైన SUV రూపాన్ని కలిగి ఉంది. దీని ఫ్రంట్ ఫాసియా ఫ్లాటర్ డిజైన్‌ను కలిగి ఉంది, వాహనం వెనుక భాగంలో 5వ తరం సిటీ సెడాన్‌ను గుర్తుకు తెచ్చే టెయిల్ లైట్లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లోని SUV డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది, ఫాగ్ ల్యాంప్‌పై క్రోమ్ హైలైట్‌లు, వాహనంపై సైడ్ స్కర్ట్‌లతో పాటు ఫ్రంట్- రియర్ స్పాయిలర్‌ల ఏరో కిట్ ఉన్నాయి. ఇవన్నీ SUVకి భారీ రూపాన్ని అందించడానికి దోహదం చేస్తాయి. BR-V N7X ఎడిషన్ మొత్తం లుక్ ప్రస్తుత అమేజ్ మోడల్‌తో సరిపోలుతుంది.
Honda BR-V N7X Edition ముఖ్య ఫీచర్లు
హోండా BR-V N7X ఎడిషన్ ఫీచర్లను పరిశీలిస్తే, క్యాబిన్ లోపల 4.2-అంగుళాల మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లే, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ హెడ్ యూనిట్, కీలెస్ ఎంట్రీ మరియు స్టార్ట్- స్టాప్ ను పొందుతుంది. SUVలో రివర్స్ కెమెరా, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, కొత్త అప్హోల్స్టరీ, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
వెలుపల వైపు, ఈ కారుకు N7X ఎడిషన్ చిహ్నంతో కూడిన డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, DRLలతో ఆకర్షించే LED హెడ్‌లైట్లు, LED టర్న్ ఇండికేటర్‌లతో పవర్ రిట్రాక్టబుల్ ORVMలు ఉన్నాయి. అలాగే నలుపు డోర్ హ్యాండిల్స్, నలుపు రంగులో ట్రీట్ చేసిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లాక్ సైడ్ గార్నిష్, బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెన్నా, డార్క్ క్రోమ్ BR-V బ్యాడ్జింగ్ , CVT వేరియంట్‌లో సిల్వర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఆల్-బ్లాక్ ఇంటీరియర్ అందిస్తున్నారు.
Honda BR-V N7X Edition ఇంజన్ సామర్థ్యం-స్పెసిఫికేషన్లు
2024 హోండా BR-V N7X ఎడిషన్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి E CVT, ప్రెస్టీజ్ CVT మరియు హోండా సెన్సింగ్ టెక్నాలజీతో కూడిన టాప్-ఆఫ్-ది-లైన్ ప్రెస్టీజ్.
హోండా BR-V N7X ఎడిషన్ యాంత్రికంగా పాత మోడల్ లాగే ఉంటుంది. ఇందులో 1.5-లీటర్ i-VTEC 4-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు, దీనిని 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కు జతచేశారు. దీని ఇంజన్ 119 bhp శక్తిని మరియు 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హోండా BR-V N7X ఎడిషన్ కారు సాండ్ ఖాకీ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, ప్రీమియం ఒపాల్ వైట్ పెర్ల్ వంటి నాలుగు పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
హోండా BR-V N7X ఎడిషన్ భారతీయ మార్కెట్లో మారుతి ఎర్టిగా, XL6 మరియు కియా కారెన్స్ వంటి ప్రముఖ మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కారు ఇండోనేషియన్ మార్కెట్లో లాంచ్ అయింది. అక్కడ దీని ధర.. IDR 319.4 మిలియన్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ. 17 లక్షలు). ఈ BR-Vని మరలా భారతదేశంలో ప్రవేశపెట్టడంపై హోండా పునరాలోచన చేస్తుందో లేదో చూడాలి.