Saidharam Special Gift to Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. పవన్ లోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్య

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కల్యాణ్‌ కు అభినందనల జల్లుల ప్రవాహం కొనసాగుతున్నది. పవన్ అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును పవన్ కు ఇటీవలే బహుమతిగా అందజేశారు.

Saidharam special gift to Pawan (Credits: X)

Vijayawada, June 16: ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM)గా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) కు అభినందనల జల్లుల ప్రవాహం కొనసాగుతున్నది. పవన్ అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును పవన్ కు ఇటీవలే బహుమతిగా అందజేశారు. తాజాగా డిప్యూటీ సీఎం మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా స్పెషల్ గిఫ్ట్‌ ను అందజేశారు. ‘స్టార్ వార్స్ అండ్ లెగో’ కిట్‌ను బహుమతిగా అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న వృద్ధులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక దర్శనం.. 30 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు.. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు.. తక్కువ ధరకే రెండు లడ్డూలు కూడా.. పూర్తి వివరాలు ఇవిగో!!

ట్వీట్ లో తేజ్ ఏమన్నారంటే?

‘స్టార్ వార్స్, లెగోలను నాకు పరిచయం చేసిన వ్యక్తి, నా ప్రియమైన జేడీ మాస్టర్ (స్టార్ వార్ కల్పిత పాత్ర), డిప్యూటీ సీఎంకు ఎట్టకేలకు ఒక బహుమతి ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఫోర్స్ కూడా మాతోనే ఉంటారు’ అని ఎక్స్‌ లో సాయిధరమ్ తేజ్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

వాహ‌న‌దారుల‌కు బిగ్ షాక్, భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు, ఏకంగా ఎంత పెంచారంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement