IIFA Utsavam 2024 In UAE: ప్రతిష్టాత్మక ఐఫా ఉత్సవం 2024కు సర్వం సిద్ధం, మెగాస్టార్ చిరంజీవికి ఐఫా వేదికగా ప్రతిష్టాత్మక అవార్డు, అలరించనున్న దక్షిణాది తారలు

దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 27, 2024న, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు ఒకే వేదికపై సందడి చేయనున్నారు.

All set for IIFA Utsavam 2024 in UAE(X)

Hyd, Sep 25:  ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 27, 2024న, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు ఒకే వేదికపై సందడి చేయనున్నారు.

ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు మెగాస్టార్ చిరంజీవి. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పౌర పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, అసాధారణ సుప్రీం హీరో మరియు దక్షిణ భారత సినిమా మెగాస్టార్, చిరంజీవి ' అవుట్ స్టాండింగ్ అచివ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' కోసం ఐఫా ఉత్సవం ప్రత్యేక గౌరవం అందుకోనున్నారు.

సౌత్ స్టార్స్ రానా దగ్గుబాటి మరియు తేజ సజ్జ తెలుగు సెగ్మెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, అకుల్ బాలాజీ మరియు విజయ్ రాఘవేంద్ర కన్నడ విభాగానికి బాధ్యత వహిస్తారు. మలయాళ విభాగానికి పెర్లే మానే మరియు సుదేవ్ నాయర్ హోస్ట్‌గా వ్యవహరిస్తారు మరియు తమిళ విభాగానికి సతీష్ మరియు దివ్య మీనన్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు.

Here's Video:

 

View this post on Instagram

 

A post shared by IIFA Utsavam (@iifautsavam)

ఈ ఉత్సవాల్లో లెజెండరీ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా తన సిగ్నేచర్ డ్యాన్స్ మూవ్స్‌ అదరగొట్టనుండగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, రాశి ఖన్నా, ప్రగ్యా జైస్వాల్, మాలాశ్రీ, ఆరాధనా రామ్ అలరించనున్నారు.

ప్రముఖ సినీ నిర్మాత మణిరత్నం, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, లెజెండరీ నటుడు కమల్ హాసన్, రెహమాన్ , రిషబ్ శెట్టి, శివ కార్తికేయన్ వంటి నటులు హాజరుకానున్నారు. ఏ మాయ చేసావే, ఈగ వంటి చిత్రాలలో మెప్పించిన సమంత IIFA 2024 ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవానికి సంబంధించిన టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి.

Here's Video:

 

View this post on Instagram

 

A post shared by IIFA Utsavam (@iifautsavam)

 

View this post on Instagram

 

A post shared by IIFA Utsavam (@iifautsavam)

 

View this post on Instagram

 

A post shared by IIFA Utsavam (@iifautsavam)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif