SIIMA Awards 2019: సౌత్ ఇండియన్ మెగా సినిమా ఉత్సవం 2019 నామినేషన్స్ లిస్ట్. బెస్ట్ సినిమా, బెస్ట్ యాక్టర్‌గా మీరైతే ఎవరిని ఎన్నుకుంటారు?
దక్షిణ భారతదేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నింటిని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి, తెలుగు, కన్నడ, తమిళ, మళయాల భాషలకు చెందిన నటీనటులందరిని ఒక చోట చేర్చి...
సౌత్ ఇండియాలో బెస్ట్ మూవీ ఏది, బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ డైరెక్టర్ ఎవరు తెలుసుకోవాలంటే.. సౌత్ ఇండియన్ మెగా సినిమా ఉత్సవం సైమా అవార్డ్స్ (SIIMA Awards) ను తప్పకుండా చూడాల్సిందే. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా సైమా అవార్డ్స్ 'కలర్ ఫుల్' గా ముస్తాబై వచ్చేసింది.
దక్షిణ భారతదేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నింటిని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి, తెలుగు, కన్నడ, తమిళ, మళయాల భాషలకు చెందిన నటీనటులందరిని ఒక చోట చేర్చి వారిలో ఈ ఏడాదికి ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి అవార్డ్ తో ఘనంగా సత్కరించే వేడుక ఈ సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards).
సైమా అవార్డ్స్ 2019 8వ ఎడిషన్ (SIIMA Eighth Edition) ను ఈసారి దోహ మరియు ఖతార్ దేశాలలో నిర్వహిస్తున్నారు. ఆగష్టు మూడో వారంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఈ ఏడాది సౌత్ నుంచి హీరోలలో మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, ధనుష్, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి మరియు హీరోయిన్లలో సమంత అక్కినేని, త్రిష, రష్మిక మందాన, అనుష్క లతో పాటు మరెంతో మంది టాప్ సెలబ్రిటీలు అవార్డ్ రేసులో ఉన్నారు.
విశేషం ఏమిటంటే సైమా అవార్డ్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఈ ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో - అక్షయ్ కుమార్ ఉత్తమ విలన్ అవార్డ్ రేసులో ఉన్నాడు. అక్షయ్ రోబో 2.0లో నెగెటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే కదా.
మరి తెలుగులో ఈ ఏడాది ఏయే సినిమాలు అవార్డ్ రేసులో ఉన్నాయి, ఎవరెవరు ఈ సారి అవార్డ్ బరిలో నిలిచారు ఒకసారి నామినేషన్ లిస్ట్ చూడండి.
2019 సైమా అవార్డ్స్ నామినేషన్స్ తెలుగు
బెస్ట్ ఫిల్మ్ నామినేషన్స్
భరత్ అనే నేను
రంగస్థలం
గీతా గోవిందం
అరవింద సమేత
మహానటి
ఉత్తమ నటుడు నామినేషన్స్
మహేశ్ బాబు (భరత్ అనే నేను)
విజయ్ దేవరకొండ (గీతా గోవిందం)
ఎన్టీఆర్ (అరవింద సమేత)
రామ్ చరణ్ (రంగస్థలం)
దుల్కర్ సల్మాన్ (మహానటి)
సుదీర్ బాబు (సమ్మోహనం)
ఉత్తమ నటి నామినేషన్స్
సమంత అక్కినేని (రంగస్థలం)
కీర్తి సురేష్ (మహానటి)
రష్మిక మందాన (గీతా గోవిందం)
అనుష్క (భాగమతి)
అదితి రావ్ హైదరీ (సమ్మోహనం)
ఉత్తమ దర్శకుడు
సుకుమార్ (రంగస్థలం)
త్రివిక్రమ్ (అరవింద సమేత)
పరశురాం (గీతా గోవిందం)
నాగ్ అశ్విన్ (మహానటి)
మోహన కృష్ణ ఇంద్రఫంటి (సమ్మోహనం)
ఉత్తమ ప్రతినాయకుడు
జగపతిబాబు (రంగస్థలం)
మాధవన్ (సవ్యసాచి)
శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
కునాల్ కపూర్ (దేవదాస్)
జయరాం (భాగమతి)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్
చైతన్య భరద్వాజ్ (Rx 100)
దేవిశ్రీ ప్రసాద్ (రంగస్థలం)
గోపి సుందర్ (గీతా గోవిందం)
మిక్కి జే. మేయర్ (మహానటి)
ఎస్.ఎస్ థమన్ (అరవింద సమేత)
ఓటింగ్ చేయాలంటే ఈ లింక్ చూడొచ్చు. http://siima.in/nomination.php