Sarrainodu Hindi Version: బన్ని సినిమా సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 300 మిల్లియన్స్ వ్యూస్ కొల్లగొట్టిన సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్‌, ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ మాస్ యాక్షన్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ (Sarrainodu Hindi Version) యుట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ (300 million YouTube views) క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు

Allu Arjun’s ‘Sarrainodu’ in dubbed Hindi version crosses 300 million YouTube views (Photo-Twitter)

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ (Sarrainodu Hindi Version) యుట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ (300 million YouTube views) క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రభాస్ న్యూ లుక్ వెరీ రొమాంటిక్, అదరగొడుతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే, రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదల

ఈ సినిమాలో మాస్‌ను ఆకట్టుకునే ఫైట్స్ , హుర్రాతలూగించే పాటలు, కుటుంబ నేపథ్యం ఇలా అన్ని సినిమాకు ప్లస్‌గా మారాయి. ఇవన్ని కలిసి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించాయి. ఈ సినిమా ఇక్కడ ఘన విజయ సాధించిన తర్వాత హిందీలోకి డబ్ చేశారు. సరైనోడు తెలుగులో కన్న హిందీలో మరింత పెద్ద విజయాన్ని అందుకుంది.

Here's Komal Nahta  Tweet

2016లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీ (Allu Arjun) ఊర మాస్‌ యాక్షన్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. మరో హీరో ఆదిపిని శెట్టి ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బన్నీ, సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మడోన్నా, తమళ్ స్టార్ విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్ వంటి వారు నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement