Prabhas 20 First Look (Photo Credits: Instagram)

అభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన ప్ర‌భాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ (Prabhas 20 First Look) రానే వ‌చ్చింది. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఏమాత్రం మెరుపు త‌గ్గ‌ని ప్ర‌భాస్ (Prabhas) రాయ‌ల్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు. బాహుబలి' తరువాత గత సంవత్సరం 'సాహో'తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్, ఇప్పుడు 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి 'రాధే శ్యామ్' అనే (Radhe Shyam First Look) టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

పోస్టర్లో బుట్టబొమ్మ పూజా హెగ్డేను (Pooja Hegde) ద‌గ్గ‌ర‌గా అదిమి ప‌ట్టుకున్న హీరో ప్రభాస్ త‌న్మ‌య‌త్వంలో ఉన్నాడు. అటు ఖ‌రీదైన దుస్తుల్లో ఉన్న పూజా కూడా ప్ర‌భాస్‌కు ప‌ర్ఫెక్ట్ జోడీగా క‌నిపిస్తోంది. ఫ‌స్ట్ లుక్ చూస్తోంటే సినిమాలో రొమాంటిక్ డోస్ ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ముందు నుంచీ ఊహించిన అంచనాల‌ను నిజం చేస్తూ "రాధేశ్యామ్" అనే టైటిల్‌నే చిత్ర‌యూనిట్ ఖ‌రారు చేసింది. జిల్ ఫేం రాధాకృష్ణ (Radha Krishna Kumar) దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ (UV Creations) నిర్మిస్తున్నాయి.

Here's Radhe Shyam First Look

ఈ చిత్రంలో పూజాహెగ్డే, ప్రియదర్శి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో భ‌ళ్లాల దేవ రానా కూడా అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. విల‌న్ ఎవ‌ర‌నేది మాత్రం ఇప్ప‌టికీ గోప్యంగానే ఉంచుతున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా షూటింగ్ జార్జియాలో ముగిసిన తరువాత, ఇంటికి చేరుకున్న యూనిట్ సభ్యులంతా కొన్ని రోజుల పాటు హోమ్ క్వారంటైన్ అయ్యారు. తదుపరి షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో నిర్వహిస్తారు. కాగా ఈ చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే.మ‌రోవైపు ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన కొద్ది నిమిషాల్లోనే వైర‌ల్ అవుతోంది.

ఎన్నో రికార్డులు, అవార్డులు ఘనతలు అందుకున్న ‘బాహుబలి’ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చిచేరింది. బాహుబలిలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటనకు గాను ‘రష్యా ఆడియన్స్‌ హార్ట్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2015కు గాను ప్రకంటించిన అవార్డుల జాబితాలో ప్రభాస్‌కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని విపరీతంగా పొందడంతోనే ప్రభాస్‌కు ఈ అవార్డు లభించిందని అక్కడి ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక ఈ అవార్డు అందుకుంటున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్‌ నిలవనున్నాడు. గతంలో దిగ్గజ నటుడు రాజ్‌కపూర్‌ ఈ అవార్డును అందుకున్నారు. శ్రీ 420, అవారా, ఆరాధన వంటి చిత్రాలతో రష్యన్ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుని రష్యన్‌ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్ 30ఏళ్ల క్రితం ఈ అవార్డును అందుకున్నారు.