Kannappa: కన్నప్పలో పిలకగా బ్రహ్మానందం, గిలకగా సప్తగిరి....సోమవారం అప్‌డేట్ ఇచ్చిన మంచు విష్ణు

ప్రతీ సోమవారం కన్నప్ప గురించిన అప్‌డేట్ ఇస్తూ వస్తున్న హీరో మంచు విష్ణు ఇవాళ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా కామెడీ నటులు బ్రహ్మానందం, సప్తగిరి కార్టెక్టర్లను రివీల్ చేశారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో పిలక పాత్రను, సప్తగిరి గిలక పాత్రను పోషించారు.

Brahmanandam as Pilaka and Sapthagiri as Gilaka from Kannappa(X)

Hyd, Sep 30: ప్రతీ సోమవారం కన్నప్ప గురించిన అప్‌డేట్ ఇస్తూ వస్తున్న హీరో మంచు విష్ణు ఇవాళ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా కామెడీ నటులు బ్రహ్మానందం, సప్తగిరి కార్టెక్టర్లను రివీల్ చేశారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో పిలక పాత్రను, సప్తగిరి గిలక పాత్రను పోషించారు.

చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే అంటూ ఈ గురువులిద్దరి పాత్రలను అందరికీ పరిచయం చేశారు. చూస్తుంటే వీరిద్దరి కామెడీ కన్నప్ప చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్, తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి, మారెమ్మ పాత్రకు సంబంధించిన నటి ఐశ్వర్య లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, ఐఫా అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్, వేదికపై బాలయ్య,వెంకీ కూడా 

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement