Chiranjeevi 154th Film: చిరూ 154 లుక్‌ రిలీజ్, పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్ లుక్, వింటేజ్ లుక్‌ అంటోన్న ఫ్యాన్స్

మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. రీ ఎంట్రీ తర్వాత వరుసగా మూవీస్ చేస్తున్న చిరంజీవి, మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళా శంకర్ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరు..మరో సినిమా షూటింగ్‌ షురూ చేశారు.

Hyderabad November 06: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. రీ ఎంట్రీ తర్వాత వరుసగా మూవీస్ చేస్తున్న చిరంజీవి, మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళా శంకర్ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరు..మరో సినిమా షూటింగ్‌ షురూ చేశారు.

ఆయన నటిస్తున్న 154వ సినిమా పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ మూవీకి సంబంధించిన చిరంజీవి మాస్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేశారు.

ఇందులో చిరంజీవి లైట‌ర్ వెలిగించి సిగ‌రెట్ కాలుస్తున్నట్టు క‌నిపించారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తుంది. ఒకప్పుడు బిగ్ బాస్‌ మూవీలో చిరూ లుక్‌ను తలపిస్తోంది. మళ్లీ బాస్‌ మాస్‌ లుక్‌లో కనువిందు చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

 

అటు మెగాస్టార్‌తో త‌న సినిమా లాంచ్ అయిన నేప‌థ్యంలో బాబీ చేసిన ట్వీట్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. “మెగాస్టార్, ఆయన పేరు వింటే…అంతు లేని ఉత్సాహం ! ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం.. తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం, పద్దెనిమిదేళ్ల క్రితం….ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.” అని ట్వీట్‌ చేశాడు.

 

బాబీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్​ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement