The Lion King: సింబాగా సింహగర్జన చేసిన నేచురల్ స్టార్ నాని, డిస్నీ 'ద లయన్ కింగ్' లో ఏయే క్యారెక్టర్లకు ఎవరెవరు గొంతుక అయ్యారో చూడండి.
ఈసారి తమ ప్రతిష్టాత్మక యానిమేషన్ సినిమా 'ది లయన్ కింగ్' (The Lion King) కోసం ప్రముఖ నటులతోనే డబ్బింగ్ చెప్పించింది.
లక్ష్మీగణపతి ఫిల్మ్స్ సగర్వంగా సమర్పించు దెయ్యాల కొంప, దెయ్యాల కొంప అంటూ పదిసార్లు గట్టిగా అరిచే డబ్బింగ్ గర్జనలు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇంతకుముందు ఏదైనా హాలీవుడ్ సినిమా తెలుగులో డబ్ అయిందంటే అందులో ఒక జీవం ఉండేది కాదు. సరిగా ఇదే పాయింట్ క్యాచ్ చేసిన హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ (Disney) ఈసారి తమ ప్రతిష్టాత్మక యానిమేషన్ సినిమా 'ది లయన్ కింగ్' (The Lion King) కోసం ప్రముఖ నటులతోనే డబ్బింగ్ చెప్పించింది. ఇండియాలో వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఆయా భాషల్లో స్టార్ హీరోలు, స్టార్ యాక్టర్లతోనే డబ్బింగ్ చెప్పించింది.
దీంతో ఈ సినిమా పట్ల ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా చూసేందుకు చిన్నపిల్లలే కాదు, తమ అభిమాన హీరో గొంతు వినేందుకు పెద్ద ఎత్తున అభిమానులు సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
హిందీలో ఈ సినిమాకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, అతడి కొడుకు ఆర్యన్ ఖాన్ మరియు ఆశిష్ విద్యార్థి లాంటి పేరున్న నటులు తమ వాయిస్‌ను అందించగా తెలుగులో ఏయే క్యారెక్టర్లకు ఏయే నటుడు వాయిస్ చెప్పారో ఇక్కడ చూడండి.
ముఫాసా కొడుకు సింబాగా నేచురల్ స్టార్ నాని
ముఫాసాగా రవిశంకర్
స్కార్ గా జగపతి బాబు
నాలాగా సింగర్ లిప్సిక
టిమన్ గా అలీ
పుంబాగా బ్రహ్మానందం
ఇక ఇవే క్యారెక్టర్లకు ఇతర భాషల్లో ఎవరెవరు స్టార్లు వాయిస్ ఇచ్చారంటే...
హిందీలో
తమిళంలో