Vijay Antony: ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం.. నటుడి కుమార్తె మీరా సూసైడ్.. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఇంట్లో లేని విజయ్

ప్రముఖ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్‌ పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు.

Credits: X

Newdelhi, Sep 19: ప్రముఖ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా (Meera) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్‌ పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. చర్చ్ పార్క్ స్కూల్‌ లో మీరా పన్నెండో తరగతి చదువుతోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో దుపట్టాతో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కావేరీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మీరా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Chandra Shekhar: తనను మార్కెట్లో అమ్మకుండా చూడాలని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. రామచరిత మానస్ ను ఇటీవల పొటాషియం సైనేడ్‌ తో పోల్చిన బీహార్ మంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు

కొంత కాలంగా డిప్రెషన్‌ తో..

కుమార్తె ఆత్మహత్య సమయంలో ఆంటోనీ ఇంట్లో లేరని సమాచారం. మీరా ఆత్మహత్యకు ఒత్తిడే కారణమని తెలుస్తోంది. మీరా గతకొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటోందని సమాచారం.

Tirupati: తిరుపతి జిల్లాలో ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత.. కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో ఘటన

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement