Vijay Antony (Photo-X)

నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ విజయ్‌ ఆంటోని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుందని తెలిసిందే.విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోని (Meera Antony) మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని (Chennai) డీడీకే రోడ్‌లోని తమ నివాసంలో ప్రాణాలు కోల్పోయింది. ఓ ప్రైవేటు పాఠశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న 16 ఏండ్ల మీరా చదువుల్లో ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. కూతురు ఆకస్మిక మరణంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది.

‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం.. నటుడి కుమార్తె మీరా సూసైడ్.. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఇంట్లో లేని విజయ్

విజయ్‌ ఆంటోనీ ఏడేండ్ల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. అయితే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలచివేచే విషయం. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.

Here's Video

జీవితంలో ఎంతటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోకండి. ఆత్మహత్య చేసుకున్న వారి పిల్లల గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాకు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీకు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నాన్న వెళ్లిపోయాక మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అందుకే ఆత్మహత్యల గురించి విన్నప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే పలు సంక్షోభాల లోతు నాకు తెలుసు.. అంటూ విజయ్‌ ఆంటోనీ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.