Chennai Court Grants Divorce To Dhanush and Aishwarya: ఎట్టకేలకు ఆ స్టార్ కపుల్ కు విడాకులు మంజూరు, 18 ఏళ్ల వివాహ బంధానికి చట్టపరంగా తెర
ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.
Chennai, NOV 27: తమిళ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య (Dhanush and Aishwarya) రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో (Chennai Court) దరఖాస్తు చేసుకున్నారు. తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.
కాగా ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను () 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర అనే కుమారుడు జన్మించాడు. 2022లో ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.