Jaanu: ఒక్కోసారి జీవితంలో ఏమీ జరక్కపోయినా, ఏదో జరుగబోతోందని మనసుకు మాత్రం ముందే తెలిసిపోతుంది.. ఆహ్లాదకరంగా ఉన్న 'జాను ట్రైలర్' !

ఎగసిపడే కెరటానివి నువ్వు, ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓరచూపుకోసం.. నీ దోరనవ్వు కోసం, రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు ఓ చూపు అప్పు ఇయ్యలేవా....

Jaanu Trailer | (Photo Credits: Dil Raju)

"ఎగసిపడే కెరటానివి నువ్వు, ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓరచూపుకోసం.. నీ దోరనవ్వు కోసం, రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు ఓ చూపు అప్పు ఇయ్యలేవా"?

ఈ అందమైన కవిత్వంతో మొదలవుతుంది వారి కథ. ఒక జంట మధ్య స్నేహం - ప్రేమల యొక్క సున్నిత భావాలను చూపే ఓ కథనే - '96'. తమిళంలో విజయ్ సేతుపతి- త్రిష జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ అవుతోంది.

తెలుగులో శర్వానంద్ (Sharwanand)- సమంత (Samantha ) కలిసి నటిస్తున్న 'జాను' చిత్రాన్ని, తమిళంలో 96కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు వెర్షన్ ను కూడా తెరకెక్కించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని ఫీల్ గుడ్ పాట, థీమ్ సాంగ్ 'ఊహలే.. ఊహలే' విడుదల చేసిన సినిమా టీం, ఫిబ్రవరి 07న సినిమా విడుదలవుతుండటంతో సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు.

Take a peek into the Trailer Here:

ట్రైలర్ చూస్తే, ఒరిజినల్ కథ- కథనంను ఎలాంటి కల్తీ చేయకుండా మరోసారి ఆ అందమైన కావ్యాన్ని అంతే తాజాగా ఆవిష్కరిస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రతీ ఒక్కరికి తమ స్కూల్ లైఫ్ జ్ఞాపకాలు, అప్పటి స్నేహాలు, స్నేహితులు మరొకసారి గుర్తుకువస్తాయి.

Indulge your soul into Oohale Song:

ఎంతో పరిపక్వమైన నటనను, అభినయాన్ని ప్రదర్శించే శర్వానంద్ మరియు సమంత ఈ చిత్రంతో మరోసారి తమ ప్రతిభను కనబరిచారు.

మరి '96' తెలుగు వెర్షన్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now