Natu Natu Song: నాటు నాటు పాట నాకు నచ్చలేదు, కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు, అదొక పాటేనా...వాయింపుడు తప్ప ఏముంది అందులో..
ఓవైపు ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో నాటు నాటు పాటను ప్రపంచమంతా ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఆ పాట అంత బాలేదా అంతగా బాలేదని సాక్షాత్తు ఆ పాట సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓవైపు ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో నాటు నాటు పాటను ప్రపంచమంతా ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఆ పాట అంత బాలేదా అంతగా బాలేదని సాక్షాత్తు ఆ పాట సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు కీరవాణి మంచి పాటలను కంపోజ్ చేశాడని వాటితో పోలిస్తే ఆర్ఆర్ఆర్ లో ఉన్నటువంటి నాటు నాటు పాట ఏమంత గొప్పగా లేదని రణగొణ ధ్వని తప్ప ఆ పాటలో శ్రావ్యత లేదని శివశక్తి దత్త ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గీత రచయిత చంద్రబోస్ రాసిన 5000 పాటల్లో నాటు నాటు పాట ఏ మూలకు వస్తుందని, సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతే కాదు తనకు ఆర్ఆర్ఆర్ చిత్రం నచ్చలేదని ఆ సినిమా కన్నా బాహుబలి సినిమానే చాలా బాగుంటుందని శివశక్తి దత్త పేర్కొన్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని క్లైమాక్స్ లో వచ్చే రామం రాఘవం పాటను శివశక్తి దత్తానే రాశారు కానీ ఆ పాట అనుకున్న విధంగా కంపోజ్ చేయలేదని తన కుమారుడు కీరవాణిని విమర్శించారు. చాలా చెత్తగా కంపోజింగ్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే కీరవాణి తండ్రి శివశక్తి దత్త బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఆర్టిస్ట్ గాను రచయిత గానూ రాణించారు. 91 ఏళ్ల వయసు ఉన్నటువంటి శివశక్తి దత్త నేటికీ ఎంతో ఉత్సాహంతో సినిమా కథలను రాసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అంతేకాదు శివశక్తి దత్త ప్రస్తుతం ఓ సినిమాను నిర్మిస్తున్నారు.
Vastu Tips For Bed Room: బెడ్రూం వాస్తు టిప్స్ మీ కోసం,
మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం రాజమౌళి బృందాన్ని ప్రశంసించారు ట్విట్టర్ ద్వారా వేలాది మంది శుభాకాంక్షలు తెలిపారు. లాస్ యాంజిల్స్ లో జరిగినటువంటి ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు చిత్ర హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హాజరవటం విశేషం.