Actress Tejaswi Madiwada: చిన్నప్పుడు పానీపూరి బండివాడ్నిపెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపిన హీరోయిన్ తేజేస్వి, ఇప్పుడు పెళ్లే వద్దని రియలైజ్ అయ్యానని చెబుతున్న ముద్దుగుమ్మ, నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న అమ్మడు పానీ పూరి బండి ఫోటో

ఐస్‌క్రీమ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తేజేస్వి మడివాడ (Ice Cream Heroine Tejaswi Madiwada) తాజాగా తన చిన్ననాటి విషయాలను షేర్ చేసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు..ఇన్‌స్టా‌గ్రాంలో తాజాగా ఓ ఫోటోను షేర్‌ చేసింది

Heroine Tejaswi Madiwada (Photo-Instagram)

ఐస్‌క్రీమ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తేజేస్వి మడివాడ (Ice Cream Heroine Tejaswi Madiwada) తాజాగా తన చిన్ననాటి విషయాలను షేర్ చేసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు..ఇన్‌స్టా‌గ్రాంలో తాజాగా ఓ ఫోటోను షేర్‌ చేసింది. 'చిన్నప్పుడు పానీపూరి బండివాడ్ని పెళ్లి చేసుకోవాలి ( I Was Child I Wanted To Marry Panipuri Wala) అనుకునేదాన్ని.

కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు కదా..ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని రియలైజ్‌ అయ్యాను' అంటూ పానీపూరి బండిని తోసుకెళ్తున్న ఫోటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. కొంపదీసి ఆ బండిని మీ ఇంటికి తీసుకెళ్తావా ఏంటి అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తేజస్వి.. ఆ తర్వాత 'లవర్స్‌', 'మనం', 'హార్ట్‌ ఎటాక్‌' సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

Here's Heroine Tejaswi Madiwada Tweet

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

అయితే 2018లో వచ్చిన బిగ్‌బాస్‌-2లో పాల్గొన్న అనంతరం తేజస్వి పలు విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా కౌశల్‌తో ప్రవర్తించిన తీరుతో ట్రోల్స్‌ బారిన పడి ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసుకుంది.

.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement