Taka Takkara Full Video Song: క‌ల్కి నుంచి ఫుల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది! కాంప్లెక్స్ అందాల్ని అద్భుతంగా చూపించిన నాగ్ అశ్విన్

టాలీవుడ్‌కు కూడా చాలా రోజుల‌కు ఒక మంచి హిట్ వ‌చ్చింది. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టక టక్కర(Ta Takkara) అని కాంప్లెక్స్‌లో సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్స్‌కు వెళ్లిన భైరవ (ప్రభాస్‌), రోక్సీ (దిశా పటానీ) అక్క‌డ‌ చూసిన వింతలేంటి?

Taka Takkara Full Video Song

Hyderabad, June 30: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ (Parbhas) న‌టించిన ‘కల్కి 2898 AD (Kalki 2898 AD) బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్‌కు కూడా చాలా రోజుల‌కు ఒక మంచి హిట్ వ‌చ్చింది. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టక టక్కర(Ta Takkara) అని కాంప్లెక్స్‌లో సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్స్‌కు వెళ్లిన భైరవ (ప్రభాస్‌), రోక్సీ (దిశా పటానీ) అక్క‌డ‌ చూసిన వింతలేంటి? ఎలాంటి అనుభూతిని పొందారో ఈ సాంగ్‌లో (Kalki Song) చూపించారు. ఇక ఈ పాట‌ను మీరు చూసేయండి.

మ‌రోవైపు బిగ్ బీ, దీపికాపదుకొనే, కమల్‌ హాసన్‌ లాంటి స్టార్‌ యాక్టర్లు సినిమాలో భాగం కావడంతో బజ్‌ రోజురోజుకీ పెరిగిపోతుంది. సినిమాకు వస్తున్న స్పందనను చూసి డిస్ట్రిబ్యూటర్లు నార్తిండియాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని స్క్రీన్స్‌ను యాడ్‌ చేశారు. ఈ రెస్సాన్స్ ఇలాగే కొనసాగితే ఇతర రాష్ట్రాల్లో మరిన్ని థియేటర్లు కూడా చేరిపోవచ్చిన ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

వైజయంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రానున్న రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని మూవీ లవర్స్‌ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement