Keerthy Suresh Lip Lock: కీర్తి సురేష్ లిప్ లాక్, పెళ్లైన మూడు రోజుల‌కే సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన న‌టి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలివిగో..

ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Keerthy Suresh Lip Lock (PIC@ X)

Goa, DEC 15: ప్రముఖ నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ ఆంటోనీ తట్టిల్‌ను (Antony Thattil) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి క్రైస్తవ సంప్రదాయంలోనూ కీర్తి సురేశ్‌, ఆంటోనీ తట్టిల్‌ మరోసారి పెళ్లి (Keerthy Suresh Wedding) చేసుకున్నారు. ప్రస్తుతం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కీర్తి, ఆంటోనీ తెల్లని వస్త్రాల్లో మెరిసిపోయారు. ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల మధ్య క్రైస్తవ సంప్రదాయంలో ఘనంగా పెళ్లి జరిగింది. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Keerthy Suresh And Antony Thattil  Christian Wedding Ceremony

 

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 12న గోవాలో వీరిద్దరి పెళ్లి హిందు సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగిన విషయం విధితమే. దీపావళి పండుగ సమయంలో కీర్తి సురేశ్‌ తన లవ్‌ గురించి బయటపెట్టింది.

Keerthy Suresh And Antony Thattil Seal It With A Kiss

 

దాదాపు 15 సంవత్సరాలుగా ఇద్దరి స్నేహితులు కాగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. స్నేహబంధం జీవితాంతం కొనసాగుతుందని పేర్కొంది. ఆంటోనీది వ్యాపార కుటుంబం కాగా.. తమిళనాడులోని చెన్నై, కేరళలోని కొచ్చిలో వ్యాపారాలున్నాయి. స్కూల్‌ డేస్‌ నుంచి కీర్తి సురేశ్‌, ఆంటోనీ స్నేహితులు, కాలేజీ రోజుల్లో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు.